Mahesh Babu Rajamouli : మహేష్ మూవీపై రాజమౌళి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట‘ సినిమా ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

 Rajamouli Interesting Comments On Mahesh Babu Movie, Mahesh Babu, Trivikram, Ssm-TeluguStop.com

ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.రెండవ షెడ్యూల్ డిసెంబర్ లో స్టార్ట్ చేయనున్నారు.

వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు కూడా అనౌన్స్ చేసారు.అందుకే చకచకా షూటింగ్ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో రాజమౌళి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.పాన్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమాతో ఆకట్టుకున్న జక్కన్న నెక్స్ట్ సినిమాపై ముందు నుండే అంచనాలు పెరిగాయి.

ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈ క్రమంలోనే రాజమౌళి పలు సందర్భాల్లో ఈ సినిమా గురించి చెప్పుకొచ్చాడు.

ఇక తాజాగా మరోసారి రాజమౌళి మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.

Telugu Mahesh Babu, Rajamouli, Rajamoulimahesh, Ssmb, Trivikram-Movie

రాజమౌళి మాట్లాడుతూ.”నా నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో ఉండబోతుంది అని తాను తెలుగులో ఒక పెద్ద స్టార్ తనతో సినిమా చేయాలి అనుకుంటున్నానని.పైగా ఎప్పటి నుండో తాను ఒక అడ్వెంచర్ సినిమా చేయాలనీ అనుకుంటున్నాను.

అందుకు ఇప్పుడు సరైన టైం వచ్చింది అనుకుంటున్నా.ఈ సినిమాకు మహేష్ బాబు అయితే పర్ఫెక్ట్ గా ఉంటారని అందుకే ఆయనతో సినిమా చేస్తున్నాను.

ఇది గ్లోబ్ టాటరింగ్ గా ఉంటుందని” జక్కన్న చెప్పుకొచ్చాడు.చూడాలి ఎన్ని హంగులతో ఈ సినిమా స్టార్ట్ అయ్యి పూర్తి అవుతుందో.

దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత కె.ఎల్ నారాయణ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube