రాజమౌళి ఇండస్ట్రీకి పరిచయం చేసిన విలన్లు వీళ్లే…?  

ss rajamouli introduced villains in tollywood industry Rajamouli, Pradeep Rawath, Kicha Sudeep, Supreeth Reddy, Rana, Prabhakar, - Telugu Kicha Sudeep, Prabhakar, Pradeep Rawath, Rajamouli, Rana, Supreeth Reddy

దర్శకధీరుడు రాజమౌళి వరుస విజయాలతో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ దర్శకుడికీ లేని అరుదైన ఘనతను అందుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఏ సినిమా తెరకెక్కినా ఆ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందనడంలో సందేహం అవసరం లేదు.

 Rajamouli Indroduced These Villains In Tollywood Industry

అలాంటి రాజమౌళి ఇండస్ట్రీకి ఎందరో విలన్లను పరిచయం చేశాడు.రాజమౌళి పరిచయం చేసిన విలన్లు నేటికీ వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.

రాజమౌళి సై సినిమా ద్వారా ప్రదీవ్ రావత్ ను భిక్షు యాదవ్ పాత్రలో పరిచయం చేశాడు.సై సినిమాలో క్రూరమైన విలన్ పాత్రలో నటించిన ప్రదీవ్ రావత్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు ఆ తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయ్యాడు.రాజమౌళి ఇండస్ట్రీకి పరిచయం చేసిన మరో విలన్ దేవ్ గిల్.మగధీర సినిమాలో రణదేవ్ బిల్లా పాత్రలో దేవ్ గిల్ మెప్పించాడు.అయితే ఈ సినిమాకు ముందే కృష్ణార్జున సినిమాలో నటించినా దేవ్ గిల్ కు గుర్తింపు మాత్రం ఈ సినిమాతోనే వచ్చింది.

రాజమౌళి ఇండస్ట్రీకి పరిచయం చేసిన విలన్లు వీళ్లే…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

రాజమౌళి టాలీవుడ్ కు పరిచయం చేసిన మరో విలన్ కిచ్చ సుదీప్.కన్నడలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుదీప్ ను విలన్ పాత్రకు ఒప్పించడం అంత తేలికైన విషయం కాదు.అయితే అక్కడ రాజమౌళి కాబట్టి సుదీప్ సైతం అంగీకరించక తప్పలేదు.

కెరీర్ మొదట్లో హీరో ఫ్రెండ్ క్యారక్టర్లలో ఎక్కువగా కనిపించిన అజయ్ ను విక్రమార్కుడు సినిమాలో క్రూరమైన విలన్ గా రాజమౌళి చూపించాడు.

ఆ పాత్రలో అప్పటివరకు నటించిన సినిమాలను, పాత్రలను సైతం మరిచిపోయే విధంగా అజయ్ నటించి మెప్పించడం గమనార్హం.ఛత్రపతి సినిమా చూసిన వాళ్లకు అందులో కాట్రాజ్ పాత్ర తప్పక గుర్తుంటుంది.సుప్రీత్ ఆ పాత్రలో నటించాడని చెప్పే కంటే జీవించాడని చెప్పడం కరెక్ట్.

ఇకపోతే మర్యాదరామన్న సినిమాలో పైకి కూల్ గా కనిపిస్తూనే అవసరమైన సందర్భంలో క్రూరంగా ప్రవర్తించే పాత్రలో నాగినీడు కనిపించారు.

సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ప్రభాకర్ బాహుబలి సినిమాలో నటించిన కాలకేయ పాత్రను అంత తేలికగా ఎవరూ మరిచిపోలేరు.టాలీవుడ్ లో హీరోగా వరుస విజయాలతో బిజీగా ఉన్న రానాతో రాజమౌళి భల్లాల దేవ పాత్ర వేయించాడు.ప్రభాస్ తో పోటీ పడి నటించి రానా మెప్పించాడు.

.

#Supreeth Reddy #Pradeep Rawath #Kicha Sudeep #Rajamouli #Prabhakar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajamouli Indroduced These Villains In Tollywood Industry Related Telugu News,Photos/Pics,Images..