రాజమౌళి అలా వెళ్లడం ఏ ఒక్క తెలుగు వాడు ఒప్పుకోడు

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళికి బాహుబలి తర్వాత ఎన్నో బాలీవుడ్ సినిమా లకు ఆఫర్లు వచ్చాయి.బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్ వంద కోట్ల ఆఫర్‌ తో సినిమా చేయమని అడిగారు.

 Rajamouli Hollywood Movie Fans Angry, Film News , Hollywood, Mahesh Babu, Raja-TeluguStop.com

కాని బాహుబలి తర్వాత తన సినిమా దానయ్యకు చేయాల్సిందే అంటూ ఎప్పుడో ఇచ్చిన మాట ప్రకారం ఆయన నిర్మాణంలో ఆర్ ఆర్‌ ఆర్ సినిమా ను చేస్తున్నాడు.ఆ తర్వాత కేఎల్‌ నారాయణ నిర్మాణం లో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేయాల్సి ఉంది.

ఆర్‌ ఆర్‌ ఆర్‌ తర్వాత ఖచ్చితంగా రాజమౌళి కళ్లు మూసుకుని మహేష్‌ బాబుతో సినిమా చేయబోతున్నాడు అంటూ అంతా అనుకుంటున్నరు.ఇలాంటి సమయంలో రాజమౌళి ఇటీవల ఒక హాలీవుడ్‌ ఫిల్మ్‌ నిర్మాణ సంస్థ ఇచ్చిన అడ్వాన్స్ ను తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్‌ లో సినిమా లు తీస్తే.చేస్తే పర్వాలేదు కాని మన వాళ్లు హాలీవుడ్‌ వరకు వెళ్తే మనకు దూరం అయినట్లే.అందుకే రాజమౌళి కి హాలీవుడ్‌ నుండి పిలుపు రావడం చాలా సంతోషంను కలిగిస్తుంది.కాని ఆయన తెలుగు సినిమా లే చేయాలి అవి హాలీవుడ్‌ లో విడుదల అవ్వాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు.

హాలీవుడ్‌ లో మన సినిమా లు ఆడించగల సత్తా ఒక్క రాజమౌళికే ఉంది.అందుకే ఆయన్ను తెలుగు లోనే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆయన సినిమా లు హాలీవుడ్‌ కు వెళ్లాలని కోరుకున్నాం కాని ఆయన హాలీవుడ్‌ కు వెళ్లాలని ఎప్పుడు కోరుకోలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఆయన అభిమానులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.

మరి రాజమౌళి చేయబోతున్న హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ ఏంటీ.మహేష్‌ బాబు తో సినిమా పరిస్థితి ఏంటీ అనే విషయాలు తెలియాలంటే జక్కన్న నోరు విప్పాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube