లావణ్య త్రిపాఠి కోసం రాజమౌళి..!

అందాల రాక్షసి లావణ్యా త్రిపాఠి లీడ్ రోల్ లో వెన్నెల కిశోర్, సత్య నటిస్తున్న సినిమా హ్యాపీ బర్త్ డే.మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానా డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జూలై 8న రిలీజ్ ఫిక్స్ చేశారు.

 Rajamouli Guest For Lavanya Tripathi Movie Happy Birthday Trailer Release Event-TeluguStop.com

ఈమధ్యనే రిలీజైన టీజర్ తో అలరించిన హ్యాపీ బర్త్ డే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కు సిద్ధమైంది.ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ దర్శకధీరుడు రాజమౌళి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుండగా ఈ మూవీకి కాళ భైరవ మ్యూజిక్ అందించారు.

ఈ సినిమా కోసం రాజమౌళి సపోర్ట్ అందిస్తున్నారు.

సినిమా ట్రైలర్ రిలీజ్ ఏ.ఎం.బి మాల్ లో జరుగనుంది.ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి గెస్ట్ గా వస్తున్నారు.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు.కెరియర్ లో పెద్దగా జోష్ లేని లావణ్య త్రిపాఠి ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది.

సినిమాలో లావణ్యని కొత్తగా చూస్తారని చెబుతున్నారు చిత్రయూనిట్.రాజమౌళి వస్తున్నాడు అంటేనే సినిమాలో ఖచ్చితంగా విషయం ఉందని అర్ధమవుతుంది.

మరి మత్తువదలరా సినిమా లానే ఈ మూవీ కూడా ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అన్నది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube