ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ ను ప్రయోగాత్మకంగా నిర్వహించబోతున్న జక్కన్న

ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుగుతున్న ఆర్ఆర్ఆర్‌ సినిమాకు కరోనా వైరస్ బ్రేక్ వేసిన విషయం తెలిసిందే.టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గత ఆరు నెలలుగా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది.

 Rajamouli Going To Start Rrr Movie Shooting Next Month , Rajamouli, Rrr, Lockdow-TeluguStop.com

ఎట్టకేలకు ఈ సినిమాను పునః ప్రారంభించనున్నట్లుగా సమాచారం అందుతోంది.అక్టోబర్ మూడో వారంలో షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చేస్తున్నారు.

ఇప్పటికే హీరోలు ఇద్దరు కూడా ఫిజిక్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఆరు నెలల క్రితం ఉన్న వెయిట్ కి వచ్చేందుకు ఇద్దరు హీరోలు కూడా కసరత్తు చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం.

ఇక రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా 100 నుంచి 200 మంది అంతకు మించి కూడా ఉంటారు.కానీ కరోనా కారణంగా కేవలం 30 నుండి 40 మంది తో మాత్రమే షూటింగ్ చేయాల్సి ఉంటుంది.

అంత తక్కువ మంది తో జక్కన్న చేయగలడా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.ఈ విషయాన్ని అధిగమించేందుకు రాజమౌళి ఒక సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అదేంటి అంటే తన టెక్నీషియన్స్ మరియు నటీనటులను రెండు విడదీసి షూటింగ్ చేయబోతున్నాడట.

మొదటి షిప్టులో పాల్గొన్నవారు ఆరు గంటల తర్వాత వెళ్లిపోతారు.

రెండో షిఫ్ట్ వారు వచ్చి మళ్లీ 6 గంటల పాటు షూటింగ్ లో పాల్గొంటారు.ఇలా రెండు సీట్లు ఏర్పాటు చేసి షూటింగ్ ను నిర్వహించాలనే నిర్ణయానికి రాజమౌళి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందా అనేది చూడాలి.ఇప్పటికే ఆయన సినిమాను 80 శాతానికి పైగా చిత్రీకరించినట్లు గా చెప్పుకొచ్చాడు.

మిగిలిన బ్యాలెన్స్ రెండు నుంచి మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసే అవకాశం ఉంది.వచ్చే ఏడాది జులై లేదా ఆగస్టులో నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు జక్కన్న సన్నాహాలు చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube