రిపబ్లిక్ డేకు 'ఆర్ఆర్‌ఆర్‌' నుండి వచ్చే సర్‌ ప్రైజ్ ఏంటో తెలుసా?- Rajamouli Going To Give Rrr Movie Republic Day Gift

rajamouli going to give RRR movie republic day gift, rrr, rajamouli, ntr, charan, republic day, rrr surprise, gift, fans - Telugu Ajay Devagan, Alia Bhat, Charan, Fans, Gift, Ntr, Rajamouli, Ram Charan, Republic Day, Rrr, Rrr Surprise

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్‌ఆర్‌ సినిమా చిత్రీకరణ విషయంలో అనేక అడ్డంకులు అవరోధాలు వస్తూనే ఉన్నాయి.షూటింగ్‌ ప్రారంభం సమయంలో ఒక సారి ఎన్టీఆర్‌ కు ఒక సారి చరణ్‌ కు గాయాలు అయినట్లుగా వార్తలు వచ్చాయి.

 Rajamouli Going To Give Rrr Movie Republic Day Gift-TeluguStop.com

ఆ గాయాల కారనంగా దాదాపుగా మూడు నెలల పాటు షూటింగ్ వాయిదా పడింది.ఇక నటీ నటుల డేట్లు క్లాష్ అవ్వడం వల్ల మళ్లీ సినిమా రెండు మూడు నెలల పాటు వాయిదాలు పడుతూ వచ్చింది.

ఇక కరోనా కారణంగా ఏకంగా ఏడు ఎనిమిది నెలల పాటు షూటింగ్ లేకుండా గడిపేశారు.కనీసం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ను కూడా నిర్వహించలేదు.

 Rajamouli Going To Give Rrr Movie Republic Day Gift-రిపబ్లిక్ డేకు ఆర్ఆర్‌ఆర్‌’ నుండి వచ్చే సర్‌ ప్రైజ్ ఏంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మళ్లీ ఇన్నాళ్లకు వర్క్‌ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది.ఈ సినిమా స్వాతంత్ర్యంకు పూర్వం కథతో రూపొందిస్తున్నారు.

దానికి తోడు కొమురం భీమ్‌ మరియు అల్లూరి పాత్రలతో సినిమాను తీస్తున్నాడు.కనుక రిపబ్లిక్ డే సందర్బంగా ఏదో ఒక సర్‌ప్రైజ్ ను జనాలు ఆశించడం ఖాయం.

జక్కన్న కూడా అందుకు సిద్దంగా ఉన్నాడు.భారీ ప్లానింగ్స్ ఏమీ లేవు కాని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీతో పాటు టీజర్ కు సంబంధించిన అప్ డేట్‌ ను కూడా ఇచ్చే అవకాశం ఉంది.ఇదే సమయంలో క్లైమాక్స్‌ ఫైట్‌ షూటింగ్ కు సంబంధించిన ఒక చిన్న బిట్ వీడియోను లేదా పోస్టర్‌ ను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం జక్కన్న అండ్ టీం ఆ పనిలోనే ఉన్నారు అంటూ సమాచారం అందుతోంది.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను అక్టోబర్‌ లో విడుదల చేయబోతున్నారట.ఆ విషయం ఇప్పటికే లీక్‌ అయ్యింది.

దాన్నే రిపబ్లిక్ డే సందర్బంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు.

#Ajay Devagan #Charan #Ram Charan #Alia Bhat #Fans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు