ఇలా అయితే కష్టం అంటూ చరణ్‌కు జక్కన్న వార్నింగ్‌

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం కోసం ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వచ్చే ఏడాది జులైలో విడుదల చేయడం కోసం దర్శకుడు జక్కన్న చాలా కష్టపడుతున్నాడు.

 Rajamouli Give The Warning To Ram Charan-TeluguStop.com

ఇద్దరు హీరోలు ఈ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఇద్దరి హీరోల డేట్లను సర్దుబాటు చేయడం కష్టం అనే ఉద్దేశ్యంతో సినిమా ప్రారంభం కాకముందే ఇద్దరు కూడా ఈ సినిమా పూర్తి అయ్యే వరకు మరో సినిమాకు కమిట్‌ అవ్వొద్దంటూ హామీ తీసుకున్నాడు.

Telugu Charanproduce, Rajamouli, Rajamouligive, Rajamoulirrr-

  ఎన్టీఆర్‌ ఇచ్చిన హామీకి తగ్గట్లుగా పూర్తిగా ఆర్‌ఆర్‌ఆర్‌కు డెడికేట్‌ అయ్యాడు.కాని రామ్‌ చరణ్‌ మాత్రం కాస్త ఇబ్బంది పెడుతున్నాడు.మొదట వినయ విధేయ రామ చిత్రం కోసం టైం ఎక్కువ స్పెండ్‌ చేశాడు.ఇప్పుడు తండ్రి సైరా చిత్రం కోసం టైం కేటాయించాడు.సైరాకు చరణ్‌ నిర్మాత అవ్వడం వల్ల సినిమా ప్రమోషన్‌ కోసం చాలా టైం కేటాయించాడు.ఆ సమయంలో కేవలం ఎన్టీఆర్‌తో మాత్రమే జక్కన్న షూట్‌ చేయాల్సి వచ్చింది.

ఇక చిరు 152వ చిత్రాన్ని కూడా చరణ్‌ నిర్మిస్తున్నాడు.

Telugu Charanproduce, Rajamouli, Rajamouligive, Rajamoulirrr-

  మొన్న షూటింగ్‌ ప్రారంభోత్సవం అంటూ షూటింగ్‌కు హాజరు కాలేదు.ఈ నేపథ్యంలోనే చరణ్‌తో రాజమౌళి సున్నితంగా వార్నింగ్‌ ఇచ్చినట్లుగా మాట్లాడినట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.విడుదలకు తక్కువ సమయం ఉంది.

ఇలాంటి సమయంలో షూటింగ్‌కు వరుసగా హాజరు కాకుండా తప్పించుకుంటే కష్టం అంటూ తన మనసులో మాట చెప్పాడట.దాంతో చరణ్‌ ఇకపై అలా జరగకుండా చూస్తానంటూ హామీ ఇచ్చాడని కూడా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube