ఫొటోటాక్‌: బాబోయ్‌ జక్కన్న తండ్రి ఏంటీ మోడీ లా తయారు అయ్యారు!

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ దేశంలోనే టాప్ రచయితల్లో ఒకరు అనే విషయం తెల్సిందే.ఆయన ఎన్నో అద్బుత సినిమాలకు కథను అందించాడు.

 Rajamouli Father Vijayendra Prasad Look Goes Viral , K.v Vijayendra Prasad, Ntr,-TeluguStop.com

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలకు ఆయనే కథను అందించాడు.ఇక హిందీలో సల్మాన్ ఖాన్‌ బజ్‌రంగీ బాయి జాన్‌ సినిమా నుండి మొదలుకుని మొన్న విడుదల అయిన మణికర్ణిక వరకు చాలా సినిమా లకు కథను అందించాడు.

విజయేంద్ర ప్రసాద్‌ సినిమా అంటే.ఆయన కథ అందించాడు అంటే అదో బ్రాండ్‌ అన్నట్లుగా మారిపోయింది.

తన కొడుకు రాజమౌళి దర్శకత్వంలో రూపొందే ప్రతి సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని చెబుతూ ఉండే విజయేంద్ర ప్రసాద్‌ ఈసారి ఆయన కొడుకు రూపొందిస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఆ సమయంలోనే ఆయన లుక్‌ కు కూడా అనూహ్యంగా స్పందన వస్తోంది.

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జక్కన్న ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా లోని కొన్ని యాక్షన్‌ సన్నివేశాల కోసం పదుల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.తాజాగా ఆ విషయమై విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలు చూస్తుంటే ఎమోషనల్‌ అవుతారు.

ప్రతి ఒక్కరికి కన్నీరు పెట్టించే విధంగా ఉంటుందని అంటున్నారు.యాక్షన్‌ సన్నివేశాలకు కన్నీరు ఎందుకు వస్తాయా అంటూ ఇప్పుడు అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఆయన లుక్ గురించి మాట్లాడాలంటే ఈమద్య కాలంలో మన ప్రధాని నరేంద్ర మోడీ ఎలా అయితే తెల్లని గడ్డం పెద్దగా పెంచాడో ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్‌ గడ్డం కూడా అలాగే ఉంది.మోడీని ఫాలో అవుతున్న విజయేంద్ర ప్రసాద్‌ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సినిమా గురించి ఆయన వ్యాఖ్యలు ఎంతగా వైరల్‌ అవుతున్నాయో ఆయన లుక్‌ కూడా అలాగే వైరల్‌ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube