రాజమౌళి ఫ్యామిలీ ఆరోగ్యం స్టేటస్‌  

SS Rajamouli, Corona Positive, immunity Power, Rajamouli Family Health update - Telugu Corona Positive, Immunity Power, Rajamouli Family Health Update, Ss Rajamouli

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి మరియు ఆయన కుటుంబ సభ్యులు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే.స్వల్పంగా జ్వరం మరియు ఇతర సమస్యలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా ఇంట్లో అందరికి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యిందని రాజమౌళి స్వయంగా ప్రకటించాడు.

 Rajamouli Family Health Status

ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉందని అయితే వైధ్యుల సూచన మేరకు స్వీయ నిర్భందంలో ఉన్నట్లుగా రాజమౌళి పేర్కొన్నాడు.
ఇక ప్రస్తుతం రాజమౌళి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ఏంటీ అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సమయంలో ఆ కుటుంబ సభ్యులకు సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి రాజమౌళి ఆరోగ్య విషయమై క్లారిటీ ఇచ్చాడు.ఆ కుటుంబం పూర్తి ఆరోగ్యం నిలకడగా ఉంది.

రాజమౌళి ఫ్యామిలీ ఆరోగ్యం స్టేటస్‌-Movie-Telugu Tollywood Photo Image

ఎలాంటి ఆందోళన లేకుండా వారు హ్యాపీగా ఉన్నారు.ఇంట్లో వారు అంతా కూడా ప్రస్తుతం ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకునేందుకు ఆహారం తీసుకోవడంతో పాటు యోగా మెడిటేషన్‌ ఇంకా ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

వచ్చే వారంలో వారికి పరీక్షలు నిర్వహించనున్నారు.ఆ పరీక్షల్లో వారికి నెగటివ్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.రాజమౌళి కరోనాను జయించిన తర్వాత ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు వస్తానంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.ప్రస్తుతం ప్లాస్మా దానం ప్రచారంలో భాగంగా చాలా మంది మీడియా ముందుకు వస్తున్నారు.

జక్కన్న కూడా ప్లాస్మా దానం చేస్తాను అనడం మంచి పరిణామం.

#Corona Positive #SS Rajamouli #Immunity Power

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajamouli Family Health Status Related Telugu News,Photos/Pics,Images..