ప్రభాస్ 25వ సినిమా మళ్లీ రాజమౌళి అంటారేంటీ?

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ చేసిన బాహుబలి 1 మరియు బాహుబలి 2 లు ఏ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బాక్సాఫీస్ ను షేర్‌ చేసిన బాహుబలి కాంబో మళ్లీ రిపీట్ అవుతుందా అంటే ఇన్నాళ్లుగా ఇప్పట్లో లేదు అని అంతా అనుకున్నారు.

 Rajamouli Director For Prabhas 25th Movie-TeluguStop.com

కాని ఇటీవల వీరి కాంబో రిపీట్‌ అవ్వబోతుంది అంటున్నారు.అది ఇప్పుడు కాకున్నా ఇంకొన్నాళ్లకు అనుకున్నారు.

కాని రాబోయే రెండు మూడు ఏళ్లలోనే వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని అంతా అంటున్నారు.ప్రభాస్‌ ప్రస్తుతం రాధే శ్యామ్‌ ను ముగించి సలార్‌ మరియు ఆదిపురుష్‌ లను చేస్తున్నాడు.

 Rajamouli Director For Prabhas 25th Movie-ప్రభాస్ 25వ సినిమా మళ్లీ రాజమౌళి అంటారేంటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వచ్చే ఏడాది నుండి ప్రాజెక్ట్‌ కే ను మొదలు పెట్టబోతున్నాడు.ఇదే సమయంలో బాలీవుడ్‌ లో కూడా ఒక సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ సమయంలోనే ప్రభాస్ 25వ సినిమాను దిల్ రాజు బ్యానర్ లో చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.అందుకోసం టైటిల్ ను కూడా ఖరారు చేశారనే పుకార్లు షికార్లు చేశాయి.

కాని ఇప్పుడు ప్రభాస్ 25వ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు.

Telugu Dil Raju Movie, News In Telugu, Prabhas, Prabhas 25 Movie, Rajamouli-Movie

ఏడాదిలో పూర్తి చేసేలా ప్రభాస్ కోసం ఒక స్క్రిప్ట్‌ ను రాజమౌళి రెడీ చేస్తున్నారా అంటే ఔను అనే సమాధానం వినిపిస్తుంది.సోషల్‌ మీడియాలో ప్రభాస్ 25వ సినిమాకు సంబంధించిన వస్తున్న వార్తలు అభిమానులను గందరగోళంకు గురి చేస్తున్నారు.సలార్ మరియు ఆదిపురుష్‌ లతో పాన్ వరల్డ్‌ హీరోగా ప్రభాస్ పేరు దక్కించుకోవడం ఖాయం.

ఆ తర్వాత రాబోతున్న ప్రాజెక్ట్‌ కే ను హాలీవుడ్ లో విడుదల చేయడం వల్ల అక్కడ స్టార్‌ గా పేరు దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.అలాంటి స్టార్‌ తో రాజమౌళి ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ ను అనుకుంటూ ఉన్నాడని.

అది ప్రభాస్ 25వ సినిమా అవ్వబోతుంది అంటూ కొందరు చెబుతున్నారు.అయితే ఇవన్నీ పుకార్లే.

ఇప్పటి వరకు ఈ విషయమై ఎలాంటి స్పష్టత రాలేదు.ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ ప్రతి ఒక్క అభిమాని అనుకునేలా వీరి కాంబో మూవీ ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

#Prabhas #Dil Raju #Prabhas #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు