రాజమౌళికి ఆ ప్రేమ సాంగ్ అస్సలు నచ్చలేదట.. కానీ సూపర్ హిట్ అయ్యిందట!

తెలుగు చలనచిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి అందరికీ తెలిసిందే.ఈయన తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర దర్శకులలో ఒకరిగా నిలిచారు.

 Rajamouli Didnt Like Super Hit Song-TeluguStop.com

స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ప్రతి ఒక్క సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళికు బాలీవుడ్ సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఉంది.

ఈయన బాహుబలి సినిమాలో దర్శకత్వం వహించి అన్ని భాషలలో రీమేక్ చేయించగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Rajamouli Didnt Like Super Hit Song-రాజమౌళికి ఆ ప్రేమ సాంగ్ అస్సలు నచ్చలేదట.. కానీ సూపర్ హిట్ అయ్యిందట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాతో జాతీయస్థాయిలో పురస్కారం అందుకొని అదే తరహాలో ఎన్నో సినిమాలలో చేస్తున్నారు.ఇదిలా ఉంటే రాజమౌళి తొలిసారిగా 2001లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో తన దర్శకత్వం ను పరిచయం చేయగా అందులో మంచి హిట్ సాధించిన పాట తనకు నచ్చలేదట.

Telugu Bahubali, Ss Rajamouli, Super Hit Song, Tollywood-Movie

జూనియర్ ఎన్టీఆర్, గజాల జంటగా నటించిన ఈ సినిమాలో రాజమౌళి కొత్తగా తన దర్శకత్వంను పరిచయం చేయగా అందులో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఈ సినిమాను నిర్మించారు.అంతేకాకుండా ఈ సినిమాలో సంగీతానికి రాఘవేంద్ర రావే ఆయనకు సన్నిహితుడైన సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ని ఎంచుకున్నాడు.అయితే ఇందులో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పడ్డానండి ప్రేమలో మరి పాటలు పాడగా ఈ పాటలను ఓకే చేసేందుకు రాజమౌళి ని వినమని తెలిపారు.

దీంతో రాజమౌళి ఆ రెండు పాటలు వినగా ఇందులో మొదటి పాటకు సరే అని, రెండో పాట పడ్డానండి ప్రేమలో పాటకు ఇదేం ట్యూన్ తో కీరవాణి దగ్గరికి వెళ్లి పెద్దన్నా ఏంటి ఈ ట్యూన్ అస్సలు బాలేదు.నాకు నచ్చలేదు అనగా హిట్ అవుతుందిరా రాఘవేంద్ర రావు గారు ఓకే చేశారంటే అది హిట్ అయినట్ట అని కీరవాణి తెలిపారు.

దీంతో రాజమౌళి ఆ పాటను సినిమాలో ఉంచగా ఆడియో విడుదలైనప్పుడు ఈ పాట మంచి హిట్ ని సొంతం చేసుకుంది.ఓహో మనమైతే ఏ పాట చేయించుకునేవాళ్ళమో, అది ఏం అయ్యేదో అని మనసులో అనుకున్నానని ఇదివరకు రాజమౌళి తెలిపారు.

కానీ మొత్తానికి ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

#Super Hit Song #SS Rajamouli #Bahubali

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు