NTR Rajamouli : తారక్ చేసిన ట్వీట్ కు కరెక్షన్ చెప్పిన జక్కన్న.. మరో మూవీ ఫిక్స్ అయిందా?

జూనియర్ ఎన్టీఆర్ వల్ల రాజమౌళి సినీ కెరీర్ కు మేలు జరిగిందా? లేక రాజమౌళి సినిమాల వల్ల జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కు మేలు జరిగిందా? అనే ప్రశ్నలకు రెండు విధాలుగా జరిగిందని సమాధానం వినిపిస్తుంది.తాజాగా రాజమౌళికి ప్రతిష్టాత్మక అవార్డ్ రాగా తారక్ చేసిన ట్వీట్ గురించి రాజమౌళి స్పందిస్తూ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.

 Rajamouli Corrections To Tarak Tweet Details Here Goes Viral In Social Media , R-TeluguStop.com

తారక్ తన పోస్ట్ లో జక్కన్నకు అభినందనలు తెలియజేశారు.

రాజమౌళి కీర్తి ప్రపంచవ్యాపం కావడానికి ఇది ఆరంభం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

ఇన్నేళ్ల మన ప్రయాణంలో నీ గురించి నాకు తెలిసిందంతా ప్రపంచానికి తెలియాల్సిన సమయం ఆసన్నమైందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.తారక్ చేసిన ట్వీట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం.

అయితే తారక్ చేసిన ట్వీట్ గురించి రాజమౌళి స్పందించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.

తారక్ చేసిన ట్వీట్ కరెక్టే అని అయితే చిన్న కరెక్షన్ అని ఇది మన ప్రయాణానికి ఆరంభం అని రాజమౌళి కామెంట్లు చేశారు.

ఇది మన ప్రయాణానికి ఆరంభం అంటూ జక్కన్న చేసిన కామెంట్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.ఆర్.

ఆర్.ఆర్ మూవీ 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుందని రాజమౌళి కామెంట్లు చేయడం గమనార్హం.

ఆర్.ఆర్.ఆర్ మూవీ ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమా సక్సెస్ వల్ల చరణ్, తారక్ పేర్లు భాషతో సంబంధం లేకుండా మారుమ్రోగుతున్నాయి.

రాజమౌళి మహేష్ బాబు సినిమాతో మరింత ఎత్తు ఎదిగే దిశగా అడుగులు వేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.సినిమాసినిమాకు మహేష్ బాబు రేంజ్ పెరుగుతుండగా మహేష్ రాజమౌళి సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube