జక్కన్నకు పెద్ద చిక్కు

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి’.ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న విషయం తెల్సిందే.

 Baahubali Poster Copied From Hollywood Movie-TeluguStop.com

ఈ సినిమాను జులైలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇక ఈసినిమా ప్రమోషన్‌ కోసం మే 1న ఒక పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది.ఆ పోస్టర్‌ ఒక హాలీవుడ్‌ సినిమా పోస్టర్‌ నుండి కాపీ కొట్టడం జరిగిందంటూ విమర్శలు వస్తున్నాయి.1998లో వచ్చిన హాలీవుడ్‌ సినిమా ‘సిమన్‌ బిర్చ్‌’ పోస్టర్‌ను పోలి ఉంది.అంతకు ముందు కూడా జక్కన్న విడుదల చేసిన ‘బాహుబలి’ వీడియో కాపీ అని టాక్‌ వచ్చింది.

జక్కన్న గతంలో తెరకెక్కించిన సినిమాలు, సినిమాల్లోని కొన్ని సీన్స్‌ హాలీవుడ్‌ సినిమాల నుండి కాపీ చేసినవే అంటూ విమర్శలు వచ్చాయి.

ఇలా జక్కన్న ఏం చేసినా కూడా ఏదో ఒక సినిమాతో పోల్చుతూ జక్కన్నను విమర్శించేవారు ఎక్కువ అయ్యారు.గతంలో రాజమౌళి ఈ కాపీ వ్యవహారంలో స్పందించాడు.కాపీకి, స్పూర్తికి తేడా ఉంటుందని, తాను ఆ సీన్స్‌ను స్పూర్తిగా తీసుకుని తెరకెక్కించాం అంటూ చెప్పుకొచ్చాడు.ముందు ముందు జక్కన్న నుండి మరెన్ని కాపీలు వస్తాయో అని, ‘బాహుబలి’ సినిమాలో ఎన్ని సినిమాలను కాపీ చేశాడో అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈరోజు ‘బాహుబలి’కి చెందిన మరో పోస్టర్‌ను విడుదల చేయనున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube