ఆర్ఆర్ఆర్ లో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే అంశం ఇదేనట!

Rajamouli Confidence About RRR Movie,RRR, Ram Charan JR NTR, Rajamouli, Omicron, Covid19,Bollywod, RRR Movie Emotional Scenes, Naatu Naatu Song

అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్.ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 Rajamouli Confidence About Rrr Movie,rrr, Ram Charan Jr Ntr, Rajamouli, Omicron,-TeluguStop.com

ఈ పీరియాడిక్ మూవీలో ఎన్టీఆర్ ఇందులో కొమరం భీమ్ గా నటిస్తుంటే.రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

వీరికి జోడీగా అలియా భట్, ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు.

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 14 భాషల్లో రిలీజ్ కాబోతుంది.ఇందులో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్​ కీలక పాత్రల్లో నటించారు.

ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీ లలో రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ తో కలిసి వరుస ఇంటర్వ్యూలు చేస్తూ మరిన్ని అంచనాలు పెంచేస్తున్నారు.

ఈ సినిమా కూడా విజువల్ ఫీస్ట్ గా ఉంటుందని ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో నిరూపించాడు జక్కన్న.

ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాలో జక్కన్న యాక్షన్ సన్నివేశాలతో పాటు భావోద్వేగాలు కూడా మనసును హత్తుకుంటాయట.వీటి మీద కూడా రాజమౌళి ప్రత్యేక ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో ప్రతి సీన్ లో ఎమోషనల్ అంశం కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని అంటున్నారు.

Telugu Naatu Naatu, Rajamouli, Ram Charan, Rrr-Movie

ఈ సినిమాలో ప్రతి 10 నిముషాలకు ఒక ఎమోషనల్ సీన్ ఉండబోతుందని తెలుస్తుంది.ఈ మూవీ మొత్తం ఎమోషన్ తో నిండి ఉంటుందని.నాటు నాటు పాటలో సైతం ఒక ఎమోషన్ ఉంటుందని.

అది అభిమానులను ఖచ్చితంగా ఆకట్టు కుంటుందని రాజమౌళి ధీమాగా ఉన్నారు.మరి ఈ సినిమా మరొక వారం రోజుల్లో మన ముందుకు రాబోతుంది.

Telugu Naatu Naatu, Rajamouli, Ram Charan, Rrr-Movie

కాగా ఈ సినిమాను రాజమౌళి అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ నిజ జీవిత స్వభావాల ఆధారంగా ఒక కల్పిత కథతో తెరకెక్కించిన విషయం తెలిసిందే.కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించాడు.మరి ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న సమయంలో ఈ సినిమా రిలీజ్ టైం కు ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.అనుకున్న విధంగానే ఈ సినిమా మాత్రం సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube