ఆర్ఆర్ఆర్ కోసం శ్రీలంక బ్యూటీ! ఆసక్తి చూపిస్తున్న జక్కన్న  

ఆర్ఆర్ఆర్ కోసం శ్రీలంక బ్యూటీని పరిశీలిస్తున్న రాజమౌళి. .

Rajamouli Concentrate On Jacqueline Fernandez For Rrr Movie-jacqueline Fernandez,rajamouli,rrr Movie,tollywood

  • టాలీవుడ్ లో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్, తారక్ హీరోలుగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

  • ఆర్ఆర్ఆర్ కోసం శ్రీలంక బ్యూటీ! ఆసక్తి చూపిస్తున్న జక్కన్న-Rajamouli Concentrate On Jacqueline Fernandez For RRR Movie

  • ఈ సినిమాలో ఇప్పటికే అలియా భట్, అజయ్ దేవగన్ లాంటి స్టార్ కాస్టింగ్ ని ఫైనల్ చేసిన జక్కన్నకి తారక్ కి జోడీగా తీసుకున్న హాలీవుడ్ భామ హ్యాండ్ ఇవ్వడంతో మళ్ళీ హీరోయిన్ వేట మొదటికి వచ్చింది. ఈ నేపధ్యంలో తారక్ కి జోడీగా కనిపించబోయే హీరోయిన్ ని ఫైనల్ చేయడానికి టైం తక్కువ ఉండటంతో జక్కన్న చాలా మంది హీరోయిన్స్ ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.

  • Rajamouli Concentrate On Jacqueline Fernandez For RRR Movie-Jacqueline Rajamouli Rrr Movie Tollywood

    ఇప్పటికిప్పుడు మళ్ళీ ఆ ప్లేస్ లోకి హాలీవుడ్ హీరోయిన్ ని దించాలంటే కాస్తా కష్టం అయ్యే పని ఈ కారణంగా బాలీవుడ్ భామలపైనే రాజమౌళి ద్రుష్టి పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం జక్కన్న లిస్టు లో శ్రద్ధా కపూర్ తో పాటు, శ్రీలంక బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే నిత్యా మీనన్ పేరు వినిపించిన ఆమెని వేరొక పాత్ర కోసం తీసుకున్నారని సమాచారం.

  • మరి మరో రెండు వారాలలో షూటింగ్ ఆరంభం అయ్యే అవకాశం ఉన్న నేపధ్యంలో జక్కన్నని మెప్పించి ఆర్ఆర్ఆర్ లో ఛాన్స్ సొంతం చేసుకునే భామ ఎవరవుతారో చూడాలి.