ఆర్‌ఆర్‌ఆర్ రిలీజ్ అప్పుడే అంటున్న రాజమౌళి!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్, హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 Rajamouli Comments About Rrr Release Date Rrr, Rajamouli, Alia Bhatt, Olivia Mo-TeluguStop.com

తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ఆర్ రిలీజ్ డేట్ గురించి, ఇతర విషయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజమౌళి మాట్లాడుతూ యాంటీబాడీస్ అనుకున్న స్థాయిలో డెవలప్ కాలేదని అందుకే ప్లాస్మా డొనేట్ చేయలేక పోయానని చెప్పారు.కేంద్రం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లకు అనుమతి ఇవ్వడం సరి కాదని.50 శాతం ఆక్యుపెన్సీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అన్నారు.కరోనా నిబంధనలు పాటిస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్ ను హైదరాబాద్ లోనే చేయాలని అనుకుంటున్నామని వెల్లడించారు.

Telugu @ssrajamouli, Alia Bhatt, Mahabharatham, Mahesh Babu, Olivia Morris, Raja

కరోనా భయం గురించి స్పందిస్తూ దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ప్రజల్లో కరోనా భయం ఉందని తెలిపారు.ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి మాట్లాడుతూ త్వరలో తారక్ పాత్రకు సంబంధించిన టీజర్ గురించి డేట్ ప్రకటిస్తామని పేర్కొన్నారు.ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్ డేట్ ను కరోనాకు ముందు చెప్పానని ఇప్పుడైతే డేట్ చెప్పడం సాధ్యం కాదని రాజమౌళి వెల్లడించారు.

మొదట 60 రోజుల షూటింగ్ ప్లాన్ చేసుకున్నామని.ఈ షూటింగ్ పూర్తైతే రిలీజ్ డేట్ చెప్పడం సాధ్యమవుతుందని అన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కలెక్షన్స్ రికార్డులు సృష్టించాలని తనకు కూడా ఉంటుందని అయితే కథను చెప్పడానికి ఎంత ఎగ్జైట్ అవుతాననేదే తనకు ముఖ్యమని వెల్లడించారు.మహేష్ బాబుతో చేసే సినిమా గురించి ఇంకా ఏం ఆలోచించలేదని ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తైన తరువాతే మహేష్ సినిమాపై దృష్టి పెడతానని తెలిపారు.

మహాభారతం సినిమా గురించి చెబుతూ ఆ సినిమా తన మైండ్ లో ఎప్పుడూ రన్ అవుతూ ఉంటుందని.తాను ఇప్పుడు చేస్తున్న ప్రయోగాల నుంచి కొత్త విషయాలను నేర్చుకుని మహాభారతం సినిమాను తెరకెక్కిస్తానని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube