ఆర్ఆర్ఆర్ విడుదలపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి... ఎప్పుడంటే?

జక్కన్న రాజమౌళి గురించి తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.దర్శకుల విజన్ నుండి ఓ గొప్ప సినిమా అనేది ఉద్భవించేది.

 Rajamouli Clarifies On Rrr Release When-TeluguStop.com

కాని నటీనటులకు మాత్రమే గుర్తింపు వచ్చేది ఒకప్పుడు.కాని దర్శకుడుకి స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది దాసరి నారాయణరావు తరువాత రాజమౌళి అనే చెప్పాలి.

దర్శకులకు కూడా అభిమానులు, దర్శకులను బట్టి సినిమాలకు వెళ్లే అభిమానులు ఉన్నారంటే అదంతా రాజమౌళి చలవే అని చెప్పాలి.అయితే బాహుబలితో ఒక్కసారిగా భారతదేశంలో గొప్ప దర్శకుల జాబితాలో ఒకరిగా చేరిపోయారు.

 Rajamouli Clarifies On Rrr Release When-ఆర్ఆర్ఆర్ విడుదలపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి… ఎప్పుడంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకప్పుడు తెలుగు పరిశ్రమకు మాత్రమే తెలిసిన రాజమౌళి ఘనత ఇప్పుడు ప్రపంచ వ్యాప్తమైందంటే బాహుబలి అద్భుతమైన విజయం ప్రముఖ కారణం.అయితే ప్రస్తుతం రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల చేయాలని ముందుగా భావించినా కరోనా వల్ల అది సాధ్యం కానట్టు తెలుస్తోంది.అయితే ఇండియాలో కాకుండా యూఎస్ఏ లో ఈ సినిమా అక్టోబర్ 12న విడుదల కాబోతున్నట్లు తెలిపింది.

ఆర్ఆర్ఆర్ ఇప్పటికే భారీ మొత్తంలో శాటిలైట్ హక్కులు సాధించుకుంది.ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్న తారక్ ఫ్యాన్స్ కు, మెగా స్టార్ ఫ్యాన్స్ కు సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

#@ssrajamouli ##RRRMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు