హిందీ ఛత్రపతి.. రాజమౌళి క్లాప్ కొట్టారు..!

రాజమౌళి డైరక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ఛత్రపతి. ప్రభాస్ కు స్టార్ ఇమేజ్ తెచ్చిన సినిమా అదే.

 Rajamouli Clap For Hindi Chatrapathi , Bellam Konda Sinivas, Chatrapathi, Clap,-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.పెన్ స్టూడియోస్ బ్యానర్ లో జయంతి లాల్ గడా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ రీమేక్ సినిమాకు వి.వి.వినాయక్ డైరక్షన్ చేస్తున్నారు.హిందీలో మేకింగ్ కు తగినట్టుగా విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ లో మార్పులు చేశారు.

ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.ఈ కార్యక్రమానికి రాజమౌళి అటెండ్ అయ్యారు.తన సినిమా రీమేక్ కు తనే క్లాప్ కొట్టారు రాజమౌళి.సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.

బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది.అతను నటించిన యాక్షన్ మూవీస్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ రాబట్టాయి.

అందుకే పక్కా మాస్ ఎంటర్టైనర్ అయిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు.వినాయక్ డైరక్షన్ లో బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న ఛత్రపతి సినిమాపై భారీ అంచనాల్ ఉన్నాయి.

ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ మార్కెట్ పై కన్నేశారు. మరి హిందీ ఛత్రపతి తెలుగులో వచ్చిన రిజల్ట్ ను రిపీట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube