సంక్రాంతికి కూడా చూపించకుంటే ఊరుకుంటారా?

ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు నాలుగు సినిమాలు వస్తున్నాయి.ఇప్పటికే రెండు విడుదల అవ్వగా మరో రెండు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

 Rajamouli Are You Showing Any Updates For Rrr-TeluguStop.com

సినిమాల సంగతి ఏమో కాని పదుల సంఖ్యలో సినిమాల ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లు.టీజర్‌లు.

పాటలు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.అందరు వస్తున్నా సంక్రాంతికి జక్కన్న మాత్రం వచ్చేట్లుగా కనిపించడం లేదు.

కొత్త సంవత్సరం రోజే ఖచ్చితంగా ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టర్‌ రాబోతుందని ప్రచారం జరిగింది.కాని అవి పుకార్లే అయ్యాయి.

కొత్త సంవత్సరం రాని ఫస్ట్‌లుక్‌ కనీసం సంక్రాంతికి అయినా జక్కన్న తీసుకు వస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి కూడా జక్కన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్లాన్‌ చేయడం లేదు.

విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది, ఇప్పటి నుండే హడావుడి అక్కర్లేదు అనేది ఆయన అభిప్రాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Jr Ntr, Rajamouli, Ram Charan, Ups Rrr-

సంక్రాంతికి వచ్చినా రాకున్నా ఆ తర్వాత పది రోజుల్లోనే వచ్చే రిపబ్లిక్‌ డేకు మాత్రం ఖచ్చితంగా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఫస్ట్‌లుక్‌ రాబోతుందట.జక్కన్న ఆ రోజు సినిమా ఫస్ట్‌లుక్‌ను మరియు టైటిల్‌ పూర్తి అబ్రవేషన్‌ను కూడా చెప్పబోతున్నాడు.ఇది స్వాతంత్య్ర సంగ్రామంకు సంబంధించిన సినిమా కనుక జక్కన్న రిపబ్లిక్‌డేకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఫస్ట్‌లుక్‌ ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube