ఎన్టీఆర్‌ బర్త్‌డే రోజున ఆ చేదు విషయాన్ని చెప్పబోతున్న జక్కన్న

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్‌ ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.గత మూడు సంవత్సరాలుగా ఈ సినిమా ను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Rajamouli Announce New Release Date On Ntr Birthday-TeluguStop.com

మొదట ఈ సినిమా ను 2020 సంవత్సరంలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.షూటింగ్ ఆలస్యం మరియు ఇతరత్ర కారణాల వల్ల సినిమా ను 2021 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు.

ఈ ఏడాది సంక్రాంతి విడుదల చేసేందుకు కరోనా అడ్డు వచ్చింది.షూటింగ్ చివరి దశలో ఉండగా కరోనా ఎంటర్ అయ్యింది.

 Rajamouli Announce New Release Date On Ntr Birthday-ఎన్టీఆర్‌ బర్త్‌డే రోజున ఆ చేదు విషయాన్ని చెప్పబోతున్న జక్కన్న-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అప్పటి నుండి కూడా ఈ సినిమా షూటింగ్‌ అదుగో ఇదుగో అన్నట్లుగా వాయిదాల మీద వాయిదాలు పడింది.సినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది.

కరోనా కారణంగా ఈ ఏడాది సంక్రాంతి నుండి దసరాకు వాయిదా పడ్డ ఈ సినిమా మళ్లీ వాయిదా పడటం ఖాయం అయ్యింది.కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ ఆగిపోయాయి.

మరియు థియేటర్లు మూత పడ్డాయి.ఆ కారణంగానే ఈ సినిమా ను మళ్లీ వాయిదా వేస్తారనే టాక్ వస్తోంది.ఈ నెల లో ఎన్టీఆర్‌ బర్త్‌ డే ఉంది.ఆ సందర్బంగా ఎన్టీఆర్ పోషించిన కొమురం భీమ్ పాత్ర కు సంబంధించిన కొత్త పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు.

ఆ పోస్టర్‌ లో సినిమా కొత్త విడుదల తేదీపై స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నారు.ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా వాయిదా అనేది చాలా కఠిన విషయం.ఆ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.అదే ఇప్పుడు అధికారికంగా ఎన్టీఆర్ బర్త్‌ డే సందర్బంగా అనౌన్స్‌ చేయబోతున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవ్వనుందా లేదంటే సమ్మర్‌ లో విడుదల చేస్తారా అనేది చూడాలి.

#Ram Charan #Rajamouli #Komuram Bheem #RRRNew

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు