మహేష్‌ తో మూవీ.. జక్కన్న అప్పుడే అక్కడి వరకు వెళ్లలేదురా బాబు!

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే.సినిమా కు సంబంధించిన అధికారిక సమాచారం ఇప్పటి వరకు కనీసం ఒక్కటి అంటే ఒక్కటి కూడా రాలేదు.

 Rajamouli And Mahesh Babu Movie Item Song Rumors Clarity , Baahubali , Mahesh B-TeluguStop.com

ఆర్ ఆర్‌ ఆర్‌ ప్రమోషన్ సమయంలో మహేష్ బాబు తో సినిమా ను చేయాలని భావిస్తున్నట్లుగా రాజమౌళి మరియు విజయేంద్ర ప్రసాద్‌ లు ప్రకటించారు.సినిమా ను చాలా కాలం గా వాయిదా వేస్తూ వచ్చాను.

ఇప్పుడు ఆయన తో సినిమా ను చేయాల్సిందే అన్నట్లుగా రాజమౌళి పేర్కొన్నాడు.ఎట్టకేలకు మా కాంబో సినిమా రాబోతున్నందుకు సంతోషంగా ఉందని కూడా మహేష్ బాబు చెప్పాడు.

దాంతో ఈ సినిమా గురించి పుకార్లు ఓ రేంజ్ లో వస్తున్నాయి.తాజాగా ఈ సినిమా గురించి మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

బాహుబలి లో మాదిరిగా ఈ సినిమా లో ఐటెం సాంగ్‌ ను పెట్టబోతున్నారట.ఆ ఐటెం సాంగ్‌ లో ఒక్కరు కాదు.ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు స్టార్‌ హీరోయిన్స్‌ ను నటింపజేస్తాడట.బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ.

తెలుగు లో మోస్ట్ పాపులర్ హీరోయిన్‌ తో పాటు మరో హీరోయిన్‌ ను కూడా ఈ సినిమా లోని ఐటెం సాంగ్‌ లో చూపించబోతున్నాడు అనేది వార్త.ఈ వార్త గురించి జక్కన్న సన్నిహితుల వద్ద ప్రస్థావించగా.

ప్రస్తుతానికి స్టోరీ లైన్‌ సిద్దం అవుతుంది.అప్పుడే హీరోయిన్‌.

ఐటెం సాంగ్స్ అంటూ అక్కడి వరకు వెళ్లలేదు అనేది వారి స్పందన.మొత్తానికి జక్కన్న మరియు మహేష్‌ బాబు మూవీ వర్క్ జరుగుతుంది.

కాని అది స్క్రిప్ట్‌ వర్క్ అనేది వారి మాట. జక్కన్న ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించే వారు మీడియాలో వచ్చే వార్తలన్నీ కూడా పుకార్లుగానే భావించాలంటూ వారు ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube