ఆర్ఆర్ఆర్ వాయిదా... మహేష్ బాబు సినిమాకు సర్వం సిద్ధం చేస్తున్న రాజమౌళి?

దర్శకుడు రాజమౌళి భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమాను జనవరి 7న పాన్ ఇండియా లెవల్ లో ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

 Rajamouli And His Father Starts Mahesh Babu Film Work , Rajamouli, Rrr, Vijayend-TeluguStop.com

కానీ అనుకోకుండా ఒక్కసారిగా చివరి క్షణంలో కరోనా మహమ్మారి వల్ల సినిమా విడుదల తేదీని వాయిదా వేయాల్సి వచ్చింది.అయితే ఇటీవలే ఈ విషయంపై వివరణ ఇస్తూ ఆర్ఆర్ఆర్ సినిమాను వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను అని మాట ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఆర్ఆర్ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీ వాయిదా పడడంతో దర్శక ధీరుడు రాజమౌళి,అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్ తర్వాత సినిమాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు, కలర్ కరెక్షన్ అన్నింటితో పాటు సెన్సార్ కూడా పూర్తయింది.

కానీ రాజమౌళి ఈ సినిమాను పరిస్థితులన్నీ చక్కబడిన తరువాత విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే అది ఎప్పుడూ అన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు.

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తదుపరి చిత్రం మహేష్ బాబుతో చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు గా టాలీవుడ్ సినీ వర్గాల్లో వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.అయితే మహేష్ బాబు తో ఇటువంటి సినిమా తీస్తే బాగుంటుంది అన్న విషయంపై ఇప్పటికే ఇరువురి మధ్య చర్చలు కూడా సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఇండియానా జోన్స్ తరహాలో అడవి నేపథ్యంలో అడ్వెంచర్ చిత్రం అయితే వారి మదిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇండియానా జోన్స్ కథానాయకుడి పాత్రలో మహేష్ బాబు ఫర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని వారు భావిస్తున్నారట.

ఇదే కాకుండా ఇంకొన్ని ఆలోచనలు కూడా వాళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.అన్ని అనుకున్న విధంగా జరిగితే ఈ సంవత్సరం పూర్తయ్యే లోపు ఈ సినిమాకు సంబంధించిన కథను సిద్ధం చేసి,వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో స్క్రీన్ ప్లే కు సంబంధించిన పని పూర్తి చేసి, ద్వితీయార్థంలో ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆ సినిమాను మొదలు పెట్టాలి అన్న ఆలోచనలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరి ఈ విషయం పై మహేష్ బాబు నుంచి ఎటువంటి స్పందన లేదు.కాగా.

Telugu Mahesh Babu, Rajamouli-Movie

ఇటీవలే మహేష్ బాబు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.అలాగే తన అన్న బాబు ఇటీవల కాలేయ సంబంధిత వ్యాధితో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే.ఇకపోతే రాజమౌళి, మహేష్ బాబు ల సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube