మహేష్‌ తో తర్వాత రాజమౌళి 'మెగా' మల్టీస్టారర్‌

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నాడు.పెద్ద ఎత్తున అంచనాలున్న ఆర్ ఆర్ ఆర్‌ సినిమా తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా ఏంటీ అనేది ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది.

 Rajamouli Again Multi Starrer Movie With Two Mega Heros  , Allu Arjun, Flim News-TeluguStop.com

మహేష్‌ బాబుతో ఒక భారీ సినిమా ను జక్కన్న చేయబోతున్నాడు.అది ఎలా ఉంటుంది అనేది మాత్రం స్పష్టత లేదు కాని భారీగా ఉంటుంది అని విజయేంద్ర ప్రసాద్‌ పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు.

భారీ అంచనాల నడుమ వీరి కాంబోలో మూవీ వచ్చే ఏడాది పట్టాలెక్కితే 2025 వరకు విడుదల అవుతుందేమో చూడాలి.రాజమౌళి ఒక సినిమా తర్వాత ఒకటి అన్నట్లుగా మెల్లగా సినిమా లు చేస్తూ ఉంటాడు.

అయితే మహేష్‌ బాబుతో సినిమా తర్వాత ఆయన తదుపరి చేయబోతున్న సినిమా గురించి అప్పుడే చర్చ జరుగుతోంది.

Telugu Allu Arjun, Mahesh Babu, Rajamouli, Ram Charan-Movie

సోషల్‌ మీడియాలో కాస్త బాగానే ఫాలోయింగ్‌ ఉన్న ఒక వ్యక్తి మహేష్‌ బాబు తో సినిమా తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమా గురించి ఊహించి చెప్పాడు.అతడికి ఎలా తెలిసింది అనే విషయం మనకు తెలియదు కాని అతడు మాత్రం రామ్‌ చరణ్ మరియు అల్లు అర్జున్‌ లతో రాజమౌళి దర్శకత్వం లో అల్లు అరవింద్‌ అయిదు వందల కోట్ల తో సినిమా ఉండబోతుంది అంటున్నారు.టాలీవుడ్‌ లో ఇప్పటి వరకు రాని సినిమా ను అల్లు అరవింద్‌ తన కొడుకు మరియు అల్లుడితో నిర్మించాలని భావిస్తున్నాడు.

అందుకోసం రాజమౌళిని ఎంపిక చేసుకున్నాడు అంటున్నారు.ఆయన ఊహలో ఎంత వరకు నిజం ఉందో కాని అతడి ఊహ నిజం అవ్వాలి.రామ్‌ చరణ్‌ మరియు అల్లు అర్జున్‌ ల కాంబో మూవీ రాజమౌళి దర్శకత్వంలో రావాలని కోరుకుంటున్నారు.మెగా ఫ్యాన్స్ కు అంతకు మించిన కన్నుల వింధు ఉండక పోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube