రాజమౌళి భార్య నటించిన టీవీ సీరియల్ ఏదో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తులతో రమా రాజమౌళి ఒకరు.దర్శకధీరుడు రాజమౌళి భార్య అయిన రమా రాజమౌళి జక్కన్న సినిమాలకు పని చేయడంతో పాటు ఆ సినిమాలు సక్సెస్ అయ్యేలా తన సలహాలు, సూచనలు ఇస్తూ రాజమౌళికి ప్రతి విషయంలో అండగా ఉంటున్నారు.

 Rajamaouli Wife Rama Rajamouli Acted In A Telugu Serial Amrutam-TeluguStop.com

అయితే రాజమౌళి భార్య ఒక సీరియల్ లో నటించారు.వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన బుల్లితెర సీరియల్స్ లో ఒకటైన అమృతం సీరియల్ లో ఒక సన్నివేశంలో రమా రాజమౌళి నటించారు.

ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.న్యూస్ రీడర్ గా ఏ మాత్రం తడబడకుండా రమా రాజమౌళి న్యూస్ ను చదివారు.

 Rajamaouli Wife Rama Rajamouli Acted In A Telugu Serial Amrutam-రాజమౌళి భార్య నటించిన టీవీ సీరియల్ ఏదో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చాలా సంవత్సరాల క్రితం ప్రసారమైన సీరియల్ కాబట్టి ఈ విషయం ప్రేక్షకులకు ఎక్కువగా తెలియదు.రాజమౌళి భార్య సీరియల్ లో నటించారని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.గుణ్ణం గంగరాజు ఈ సీరియల్ ను తెరకెక్కించగా రాజమౌళి సోదరుడు కాంచి కూడా ఈ సీరియల్ లో నటించిన సంగతి తెలిసిందే.

రమా రాజమౌళి జస్ట్ ఎల్లో మీడియా కోసం పని చేయడం వల్ల అమృతం సీరియల్ లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం మాత్రం రమా రాజమౌళి సినిమాల్లో కనిపించడానికి ఆసక్తి చూపకపోయినా యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సైతం రమా రాజమౌళి పని చేస్తున్నారు.

రాజమౌళి ఈ స్థాయిలో సక్సెస్ కావడానికి ఒక విధంగా రమా రాజమౌళి కూడా కారణమని చెప్పవచ్చు.రమా రాజమౌళి న్యూస్ రీడర్ గా కనిపించిన వీడియోకు లక్షల్లో వ్యూస్ ఉండటం గమనార్హం.

#Yellow Media #Rama Rajamouli #RamaRajamouli #Viral Video #Rajaamouli Wife

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు