రాజమండ్రి వైసీపి ఎంపీ టిక్కెట్ రేసులో ఆ దర్శకుడు..?  

Rajahmundry Ysrcp Mp Ticket Gives To Tollywood Director..?-

రాబోయేది అల్లాటప్పా ఎన్నికలు కాదు.త్రిముఖ పోరు..

రాజమండ్రి వైసీపి ఎంపీ టిక్కెట్ రేసులో ఆ దర్శకుడు..?-

ఎవరు ఎవరితో కలిసి జట్టు కడుతారనే విషయాలు పక్కన పెడితే ఈ సారికి మాత్రం ఎవరికీ వారు ఎన్నికల బరిలోకి తమ తమ పార్టీల అజెండాలతోనే పోటీ చేస్తారని మాత్రం అర్థం అవుతోంది.అయితే వైసీపి మాత్రం ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగానే జగన్ ముందుకు అడుగులు వేస్తున్నాడు. టిక్కెట్లు ఎవరికైతే ఇవ్వాలని అనుకుంటున్నారో వారికి నేరుగా ఆ పార్టీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డితో సూచనప్రాయంగా చెప్పించినట్టు తెలుస్తోంది.

ఇదిలాఉంటేరాజమండ్రి మరియు అమలాపురం లోక్ సభ స్థానాలకి పోటీ చేయించే అభ్యర్ధుల విషయంలో ఇప్పటికే జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.అంతేకాదు ఇప్పటికీ వారికి జగన్ నిర్ణయం కూడా సుబ్బారెడ్డి ద్వారా తెలియపరిచారట.అయితే రాజమండ్రి ఏపీ స్థానానికి ఓ ప్రముఖ సీనీ దర్శకుడి పేరు వినిపిస్తోంది.

గతంలో సదరు దర్శకుడు ఎంపీ టిక్కెట్టు అడిగారట అయితే అప్పట్లో జగన్ టిక్కట్టు ఇవ్వకపోవడంతో ఇప్పుడు వైసీపినే నేరుగా ఆయన్ని రంగంలోకి దించాలని యోచిస్తోందట. అంతేకాదు ఆ డైరెక్టర్ కి సంభందించిన సామజిక వర్గం కూడా ఎక్కువగా నియోజక వర్గంలో ఉండటంతో వైసీపికి కలిసి వస్తుందని భావిస్తున్నారు.

ఇదిలాఉంటే వైసీపీ వర్గాలలో మాత్రం ఆయనే రాజమండ్రి అభ్యర్ధి అంటూ తెగ ప్రచారం చేసుకున్తునాయి.అయితే మిగిలిన అమాలపురం లోక్‌సభ స్థానం నుంచీ రిటైర్డ్‌ ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అధికారిని జగన్ రంగంలోకి దించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.జగన్‌ కేసుల సమయంలో సహకారం అందించినందుకు, బలమైన అభ్యర్థి అవుతారనే అభిప్రాయాన్ని వెల్లడించింది.

అయితే ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు జగన్ కి అతనికి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి అనే విషయాలు తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే అంటున్నారు వైసీపి నేతలు.