మునుగోడు ఉపఎన్నిక రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసం వచ్చింది : మంత్రి గంగుల కమలాకర్

ప్రజలు ఓటేసి గెలిపించేది ప్రజా సమస్కల పరిష్కారం కోసం, సొంత కాంట్రాక్టుల కోసం కాదుశివన్న గూడెం చెరువుకోసం రాజీనామా చేసినవా…? మేళ్ల చెరువు కోసం రాజీనామా చేసినవా…? ముదిరాజ్ సోసైటీ కోసం రాజీనామా చేసినవా?18వేల కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఉపఎన్నిక రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసం వచ్చిందిసంక్షేమ పథకాలతో అండగా ఉన్న కేసీఆర్ గారికి మద్దుతు ఇవ్వాలికూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుందాం, సమస్యలు పరిష్కరించుకుందాంఐదు ఎన్నికల్లో ఓటమి లేకపోవడానికి కారణం మాట తప్పకపోవడమే మీ సమస్యల్ని పరిష్కరిస్తా సంస్థాన్ నారాయణపురంలో ముదిరాజులతో మంత్రి గంగుల సమావేశం ప్రజలు ఓటేసి గెలిపించేది వారి సమస్యల పరిష్కారం కోసమని, సొంతపనుల కోసం కాదన్నారు మంత్రి గంగుల కమలాకర్, నేడు సంస్తాన్ నారాయణపురంలో ముదిరాజ్ సంఘంతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మాట్లాడారు, రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల కోసం కాకుండా, తన సొంత కాంట్రాక్టుల కోసం పనిచేస్తాడని తానే చెప్పుకుంటున్నాడని, అతనికి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు.తాను మాట ఇచ్చి తప్పే వ్యక్తిని కాదు కాబట్టే కరీంనగర్లో ఐదు ఎన్నికల్లో వరుసగా గెలిపించారన్నారు మంత్రి గంగుల కమలాకర్.

 Rajagopal Reddy's Resignation For 18 Thousand Contracts: Minister Gangula Kamala-TeluguStop.com

ఇక్కడి మాజీ ఎమ్మెల్యే ఎందుకోసం రాజీనామా చేసాడని, మునుగోడు సమస్యలైన శివన్న గూడెం చెరువుకోసం రాజీనామా చేసినవా… మేళ్ల చెరువు కోసం రాజీనామా చేసినవా… ముదిరాజ్ సోసైటీ కోసం రాజీనామా చేసినవా అని ప్రశ్నించారు మంత్రి గంగుల.ఐదు సంవత్సారాలు మన కోసం పోరాడుతాడు అనే మునుగోడు ప్రజలు ఓటేసి గెలిపించారని, వారి కోసం అసెంబ్లీలో అడుగుతాడు అని, మంత్రుల వద్దకు, ప్రభుత్వం వద్దకు పనుల కోసం వెళ్లాలని గెలిపిస్తే దాన్ని గాలికొదిలేసి సొంత రాజకీయాలు చేస్తూ 18వేల కోట్ల కాంట్రాక్టు కోసం రాజీనామా చేసిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అన్నాడు మంత్రి గంగుల కమలాకర్.

ప్రజలపై ఆర్థిక భారం మేపే ఉపఎన్నిక ఎందుకోసం వచ్చిందో మునుగోడు ప్రజానీకం ఆలోచించాలన్నారు, నాడు ఓటేసి గెలిపించిన తర్వాత కనీసం ఒక్కసారైనా మిమ్మల్ని పలకరించాడా అని ప్రశ్నించాడు, ఏనాడు రాని వ్యక్తి మల్లీ నేడు ఓటేస్తే కనిపిస్తాడా అని, అలాంటి వ్యక్తి మనకు అవసరమా అని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాల్ని వివరించారు, మునుగోడును పీడిస్తున్న ప్లోరోసిస్ని మిషన్ భగీరథతో దూరం చేసి తాగునీరు, సాగునీరు, ప్రతీ అవ్వకు, అయ్యకు ఆసరాగా ఫించన్లు ఇవ్వడమే కాకుండా కళ్యాణలక్ష్మీ, రైతుబందు, రైతు బీమా, 24గంటల ఉచితకరెంటు, గొర్రెల పంపిణీ, ముదిరాజులకు, గంగపుత్రులకు చేపపిల్లల పంపిణీ, పోడుభూములకు హక్కు, గిరిజన రిజర్వేషన్లు, ఉచిత బియ్యం, మద్దతు ధరతో పంటల సేకరణ ఇలా అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో ఉందన్నారు.

ఇంత చేస్తున్న ముఖ్యమంత్రికి అండగా ఉండాలని, ఈనెల 3న జరిగే ఎన్నికలలో కారుగుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు మంత్రి గంగుల కమలాకర్.ఈ కార్యక్రమంలో సంస్థాన్ నారాయణపురం ఎంపీపీ ఉమా ప్రెమ్ చంద్రారెడ్డి, ప్యాక్స్ ఛైర్మన్ జక్కిడి జంగారెడ్డి, నాయకులు, జక్కిడి దన్వంత్ రెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నిమ్మల నగేష్, సీపీఐ నాయకులు చిలువేరు అంజయ్య, బాలయ్య, గాలయ్య తదితరులతో పాటు కరీంనగర్ శ్రేణులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube