ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. వెంటనే ఆమోదం

అంతా అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు, ఈరోజు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేశారు.అసలు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సమయంలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చూసినా.

 Rajagopal Reddy's Resignation As Mla.. Approved Immediately Comet Reddy Rajagopa-TeluguStop.com

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో రాజీనామా వాయిదా వేసుకున్నారు.అయితే ఈరోజు స్పీకర్ అపాయింట్మెంట్ లభించడంతో తన రాజీనామా పత్రాన్ని ఈరోజు ఉదయం పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి రాజగోపాల్ రెడ్డి అందించారు.
       అయితే అలా రాజీనామా లెటర్ అందించిన వెంటనే స్పీకర్ దానికి ఆమోదముద్ర వేశారు.ఈ విషయాన్ని స్పీకర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.రాజీనామా చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆమోదించడంతో రాజీనామా చేసిన అనంతరం రాజగోపాల్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ అపాయింట్మెంట్ కోరారు.ఇక రాజీనామాను స్పీకర్ కు అందించే ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి తెలంగాణలో అరాచక , కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తన రాజీనామా అంశం ముందుకు వచ్చిందన్నారు.కేసీఆర్ చేతిలో చిక్కిన తెలంగాణ తల్లిని కాపాడుకోవాలన్నారు.
   

Telugu Cometreddy, Munugodu Mla, Telangana Bjp, Telangana-Politics

   మునుగోడు అభివృద్ధి కోసమే తన రాజీనామా అని స్పష్టం చేశారు.మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్దే తన లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో తనపై కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని,  రాజీనామా అనగానే గట్టుప్పల్ ను మండల కేంద్రంగా ప్రకటించారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

సీఎం కు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తప్ప ఇంకేమీ కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.టిఆర్ఎస్ తెలంగాణ ద్రోహులు పార్టీగా మారిందని,  ఉపఎన్నిక వచ్చాక మునుగోడు గుర్తొచ్చిందని విమర్శించారు.

త్వరలో జరగబోయే మునుగోడు యుద్ధంలో ప్రజలే గెలుస్తారని రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భాష విని సమాజం తలదించుకుంటుందని , జైలుకెళ్ళిన వ్యక్తులే మాట్లాడితే ప్రజలు నమ్మరని రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube