రాజా విక్రమార్క రివ్యూ: కామెడీ రాజా విక్రమార్క.. కార్తీకేయ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

శ్రీ సరిపల్లి దర్శకత్వంలో రూపొందిన సినిమా రాజా విక్రమార్క.ఈ సినిమాలో యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించాడు.

 Raja Vikramarka Review Comedy Raja Vikramarka How Is Karthikeyans Performance Is-TeluguStop.com

ఈయన సరసన తాన్యా హీరోయిన్ గా నటించింది.ఇక రవిచంద్రన్, సాయి కుమార్, తనికెళ్ల భరణి, జబర్దస్త్ నవీన్, జెమిని సురేష్ తదితరులు నటించారు.

ఈ సినిమాకు 88 రామ రెడ్డి నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.ప్రశాంత్ ఆర్.విహారి సంగీతాన్ని అందించాడు.రామజోగయ్య శాస్త్రి పాటలను అందించాడు.

ఇక ఈ సినిమా ఈ రోజు విడుదల కాగా కార్తికేయకు ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.

కథ: ఈ సినిమాలో కార్తికేయ విక్రమ్ పాత్రలో నటించాడు. ఇక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందాన్ని లీడ్ చేసే అధికారి పాత్రలో తనికెళ్ల భరణి నటించాడు.ఇక ఇందులో టీం మెంబర్ గా విక్రమ్ నటించాడు.

హోం మంత్రి ఇంటిలో అండర్ కవర్ సెక్యూరిటీ ఆఫీసర్ గా విక్రమ్ పని చేస్తాడు.ఇక అందులో హోం మంత్రి కూతురు కాంతి (తాన్యా) తో ప్రేమలో పడతాడు విక్రమ్.

ఇక హైదరాబాద్ లో విధ్వంసం సృష్టించాలనుకునే టెర్రరిస్టుల పై దాడి చేస్తుంటారు.ఓ ప్రధాన టెర్రరిస్టు వద్ద కుట్రకు సంబంధించిన సమాచారాన్ని తీసుకొని చంపేస్తాడు.

దీంతో విక్రమ్ కు ఆ సమయంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి.నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లో కొత్తగా జాయిన్ అయినందుకు ఎటువంటి ఇబ్బందులు పడుతాడో అనేది మిగతా కథ లోనిది.

నటినటుల నటన: ఇక ఇందులో కార్తికేయ పాత్ర బాగా ఆకట్టుకుంది.హీరోయిన్స్ తాన్యా తన పాత్రతో పర్వాలేదు అనిపించింది.

ఇక జబర్దస్త్ నవీన్, తనికెళ్ల భరణి, సాయి కుమార్, రవిచంద్రన్ తదితర నటులు తమ పాత్రలలో ఎప్పటిలాగానే నటించారు.

Telugu Karthikey, Raja Vikramarka, Review, Tollywood-Movie

టెక్నికల్: టెక్నికల్ పరంగా దర్శకుడు మంచి కథను రూపొందించాడు.ఈ సినిమా సంగీతం కూడా బాగానే మెప్పించింది.సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.

బ్యాక్ గ్రౌండ్ కూడా బాగానే ఉంది.

విశ్లేషణ: దర్శకుడు కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాడు.ఈ సినిమాలోని పాత్రకు కార్తికేయ అద్భుతంగా సెట్ అయ్యాడు.మధ్య మధ్యలో యాక్షన్ సన్నివేశాలు, కామెడీ సన్నివేశాలు బాగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: కామెడీ పరంగా ఈ సినిమా బాగా ఆకట్టుకుంది.సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కింది.

ఇదివరకు నటించిన పాత్రలో కాకుండా భిన్నమైన పాత్రలో నటించాడు కార్తికేయ.

Telugu Karthikey, Raja Vikramarka, Review, Tollywood-Movie

మైనస్ పాయింట్స్: కొన్ని పాత్రలు అంతగా మెప్పించలేవు.ఫస్ట్ ఆఫ్ స్టోరీ మొత్తం అంతగా ఆకట్టుకోలేకపోయింది.సినిమా సాగినట్లు అనిపించింది.

సెకండాఫ్ పరవాలేదు అనిపించింది.కాస్త ఆసక్తిగా మారింది.

బాటమ్ లైన్: ఈ సినిమా కామెడీ పరంగా, యాక్షన్ పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

రేటింగ్: 2.5

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube