'రాజా విక్రమార్క' విజయం కాన్ఫిడెన్స్ ఇచ్చింది - హీరో కార్తికేయ

కార్తికేయ గుమ్మకొండ, తాన్యా రవిచంద్రన్ జంటగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’.

 Raja Vikramarka Movie Gave More Confidence Says Hero Karthikeya Details, Raja Vi-TeluguStop.com

శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమయ్యారు.సుధాకర్ కోమాకుల కీలక పాత్ర పోషించారు.

శుక్రవారం సినిమా విడుదలైంది.ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.తమకు ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నిర్మాత ’88’ రామారెడ్డి, సమర్పకులు ఆదిరెడ్డి .టి థాంక్స్ చెప్పారు.

హీరో కార్తికేయ గుమ్మకొండ మాట్లాడుతూ “నిన్న (శుక్రవారం) మా ‘రాజా విక్రమార్క’ సినిమా విడుదలైంది.ఉదయం నుంచి నాకు పాజిటివ్ మెసేజ్ లు వచ్చాయి.‘ఆర్ఎక్స్ 100’ తర్వాత విడుదలైన సినిమాల్లో ఇంత పాజిటివ్ టైటిల్ ‘రాజా విక్రమార్క’కు వచ్చింది.మనం ఒకటి నమ్మినది జరిగితే మనకు తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది.ఆ కాన్ఫిడెన్స్ నిన్న ఉదయం నుంచి నాకు ఉంది.

మనందరం థియేటర్లకు వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేసే అర్హత ఉన్న సినిమా తీశాం.అది ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట.ఏ సినిమా చేసినా మనసుపెట్టి చేస్తా.ఈ సినిమాను ఎక్కువ ఇష్టపడి చేశా.

ఈ ప్రయాణంలో మోస్ట్ ఇంపార్టెంట్ మా నిర్మాతలు.రెండేళ్ల నుంచి ప్రతి ఇబ్బందిని ఎదుర్కొంటూ… మాకు మద్దతుగా నిలిచారు.

వాళ్లు తొలి రోజు ఏ చిరునవ్వుతో అయితే మమ్మల్ని సపోర్ట్ చేశారో… అదే సపోర్ట్ తో ఉన్నారు.ఇప్పుడు వచ్చిన పాజిటివ్ టాక్ తో వాళ్లకు ఇంకా మంచి ప్రాఫిట్స్ రావాలని, వాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

హర్షవర్ధన్ గారి కామెడీ ఎంజాయ్ చేశామని చాలామంది చెప్పారు.సుధాకర్ అన్నయ్యకు ఇచ్చిన మద్దతుకు థాంక్యూ.

ఇది నాకు మోస్ట్ స్పెషల్ మూవీ.సినిమా చూడండి… డిజప్పాయింట్ అవ్వరు” అని అన్నారు.

Telugu Harsha, Sri Saripalli, Karthikeya, Tanyaravi, Confidence, Raja Vikramarka

సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ “రాజా విక్రమార్క’ నిన్న విడుదలైంది.మంచి పేరు తెచ్చుకుంది.ఒక స్టయిలిష్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్, టెక్నికల్ వేల్యూస్ ఉన్న ఫిల్మ్ అని పేరు తెచ్చుకుంది.ఇండస్ట్రీ నుంచి చాలామంది కాల్ చేశారు.ఇదొక న్యూ ఏజ్ కమర్షియల్ ఎంటర్టైనర్.కార్తికేయకు విపరీతమైన పేరు వచ్చింది.

చాలా కొత్తగా ఉన్నాడని అంటున్నారు.చాలా రోజుల తర్వాత యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమా తెలుగులో వచ్చిందని కాంప్లిమేట్స్ ఇస్తున్నారు.

కార్తికేయ ఎంత కష్టపడ్డాడో దగ్గర నుంచి చూశా.బాడీని అలా మెయింటైన్ చేయడం కష్టం.

ఫస్ట్ సీన్ లో ఫస్ట్ షాట్ ఒక రోజు తీస్తే… సంవత్సరం తర్వాత రెండో షాట్ తీశాం.ఎక్కడా కూడా తేడా కనపడదు.

Telugu Harsha, Sri Saripalli, Karthikeya, Tanyaravi, Confidence, Raja Vikramarka

అతను ఎంత కసిగా చేశాడో తెలుస్తుంది.త్వరలో కార్తికేయ పెళ్లి కాబోతుంది.అతనికి బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇది.‘ఆర్ఎక్స్ 100’ చూశా.అప్పటి కార్తికేయకు, ఇప్పటికి కార్తికేయకు చాలా తేడా ఉంది.స్టయిలిష్, అర్బన్ లుక్ లో ఉన్నారు.

నా పాత్రకు వస్తే డిఫరెంట్ గా ఉందని మెసేజ్ చేస్తున్నాను.నా వైఫ్ నాకు మేజర్ క్రిటిక్.అందరూ బావుందని చెప్పినా… ‘ఓకే.పర్లేదు’ అంటుంది.ఈసారి తను కూడా అప్రిషియేట్ చేసింది.ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్, ప్లాట్ ఉన్న సినిమా ఇది.శ్రీ చాలా హార్డ్ వర్క్ చేశాడు.కామెడీని మిక్స్ చేస్తూ ఎమోషన్ యాడ్ చేస్తూ ఇంతమందితో సినిమా తీయడం కష్టం.

హర్షగారి కామెడీ టైమింగ్ నచ్చింది.ఆయన సీన్లు నేను కూడా బాగా చేశాను” అని అన్నారు.

Telugu Harsha, Sri Saripalli, Karthikeya, Tanyaravi, Confidence, Raja Vikramarka

హర్షవర్ధన్ మాట్లాడుతూ “నిన్న థియేటర్ కు వెళ్లాను.మా అమ్మతో పాటు నాతో వచ్చిన వాళ్లు పదిమంది ఉన్నాం.ఇంకెవరూ లేరు.ఎవరూ రాలేదేంటి? అని అనుకున్నాను.కరోనా వల్ల థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు సందేహిస్తున్నారేమో అనుకున్నాను.షో మొదలయ్యే ముందు చాలామంది వచ్చారు.

కాసేపటికి మరింత మంది వచ్చారు.ఫైనల్ గా అర్థమైంది ఏంటంటే… ఎవరినీ దేని నుంచి ఆపలేం.

వాళ్లు చూడాలనుకున్న సినిమా చూస్తారు.ఒక ప్రేక్షకుడిగా నేను ఊహించిన దానికంటే సినిమా చాలా బావుంది” అని అన్నారు.

Telugu Harsha, Sri Saripalli, Karthikeya, Tanyaravi, Confidence, Raja Vikramarka

దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ “సినిమా చూసి చాలామంది బావుందని చెప్పారు.ఫోనులు చేశారు.మెసేజ్ లు చేశారు.సాధారణంగా నేను థియేటర్లకు వెళ్లినప్పుడు స్మోకింగ్ యాడ్ చూసి ఇబ్బంది పడేవాడిని.ఆ విధంగా కొంతమంది అనుకున్నారు.అందుకని, కావాలని నా సినిమాలో స్మోకింగ్ సీన్లు లేకుండా తీశా” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ పీసీ మౌళి, ఎడిటర్ జస్విన్ ప్రభు, వీఎఫ్ఎక్స్‌ సూపర్ వైజర్ నిఖిల్ కోడూరు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube