తన జీవితం మొత్తం హిందుత్వ వాదానికి అంకితమై పని చేశానని, రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారే పరిస్థితిలో లేనని ఎట్టి పరిస్థితుల్లో కూడా సెక్యురల్ పార్టీలైన కాంగ్రెస్ లేదా బారా సా లలోకి చేరే ప్రసక్తే లేదంటూ గోషామహల్( Goshamahal ) ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు.2018 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రాజసింగ్ మైనారిటీ నాయకుల విషయంలో చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలతో పార్టీనుంచి సస్పెన్షన్ కు గురయ్యారు.ఇదే కేసులో ఆయన కొంతకాలం జైలు జీవితం కూడా గడిపారు.అయితే అంతర్జాతీయ ఒత్తిడి కి తోడు ప్రతిపక్షాల డిమాండ్లతో భాజపా అధిష్టానంఈయన పై వేటు వేసింది.
ఆ తర్వాత ఈయన రాజకీయ ప్రయాణం పై అనేక ఊహగానాలు వెలుపడ్డాయి బారసా కీలక నేత హరీష్ రావుతో సమావేశమయ్యారని, అధికార బారాసాల్లోకి చేరడానికి చర్చలు పూర్తయ్యాయని ,మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు అంటూ అనేక అంచనాల ఏర్పడ్డాయి.
అయితే వీటన్నిటిని తోసిరాజని తాను భాజపాలో తప్ప ఏ పార్టీలోనూ ఇమడలేనని తన భావజాలం భాజపాతోనే ముడిపడి ఉంటుందంటూ ఆయన స్పష్టం చేయడంతో ఊహగానాలన్నీ కొట్టుకుపోయాయి.అయితే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో బిజెపి ఈయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తుందా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.ఒకవేళ భాజపా సస్పెన్షన్ ఎత్తివేయకపోతే రాజకీయాల నుంచి తప్పకుంటా తప్ప ఇండిపెండెంట్గా పోటీ చేసే అవసరం లేదంటూ ఆయన చెప్పుకొచ్చారు భరాసా గోషామహల్ కి ఇంకా అభ్యర్థిని ఎన్నిక చేయకపోవడంపై స్పందించిని ఈయన ఎంఐఎం పార్టీ( MIM party ) ఆ సీటును నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ రాజ్యాంగా మార్చడమే తన జీవితాశయం అని చెప్పిన రాజా సింగ్( Raja Singh ) ఎట్టి పరిస్థితుల లోనూ తనకు వచ్చే ఎన్నికల్లో భాజపా సీటు ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు .జరుగుతున్న పరిణామాలతో భాజపా కూడా కోసం రాజాసింగ్ విషయంలో కొంత ఉదారవాద వైఖరితో ఉన్నట్లుగా తెలుస్తుంది మరికొన్ని రోజుల్లో రాజాసింగ్ సస్పెన్షన్ పై బిజెపి నుంచి ఒక ప్రకటన వస్తుందన్నట్లుగా అంచనాలు ఉన్నాయి
.