సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు రాజారవీంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎన్నో సినిమాలలో విలక్షణ పాత్రలో నటించిన రాజా రవీంద్ర “క్రేజీ అంకుల్స్” అనే చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈచిత్రంలో బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న శ్రీముఖితో పాటు, సింగర్ మనో, భరణి, రాజా రవీంద్ర కీలక పాత్రలో నటించారు.ఈ సినిమాకి సత్తిబాబు దర్శకత్వం వహించగా,గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తి చేసుకున్నప్పటికీ కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ఆగష్టు 19న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమాలో నటించిన నటులలో ఒకరైన రాజా రవీంద్ర ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సినిమా గురించి ముచ్చటించారు.ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ.50 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత తన భార్య భర్తను పట్టించుకోకపోతే అతని ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో అన్న విషయాన్ని ఎంతో సరదాగా చూపించమని, ఈ సినిమాను చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఎంతో నవ్వుకుంటారని తెలియజేశారు.

ఈ సినిమాలో మనో, భరణి, నేను స్నేహితులు.అయితే ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిని లైన్ లో పెడుతూ ఏవిధమైనటువంటి సమస్యలను ఎదుర్కోవలసి వచ్చిందో ఈ సినిమాలో చూపించామని రాజారవీంద్ర తెలిపారు.అలాగే తనకు నటన అంటే ఎంతో ఇష్టమని, ఒకవేళ ఆర్టిస్ట్ గా తనకు ఎలాంటి అవకాశాలు రాకపోయి ఉంటే ఇండస్ట్రీలోనే కాఫీ, టీలు ఇస్తూ ఉండిపోయేవాడిని అంటూ ఈ సందర్భంగా రాజా రవీంద్ర తెలియజేశారు.