సమంత ఇటు టాలీవుడ్లో అటు కోలీవుడ్‌లో కూడా వరుస ఆఫర్లతో దూసుకు పోతుంది.తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈ అమ్మడు తమిళంలో మరో బంపర్ ఆఫర్ కొట్టేంది.
ప్రస్తుతం తమిళంలో విక్రం సరసన నటిస్తున్న ఈ అమ్మడు తాజాగా హీరో విజయ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది.ఈ అమ్మడు విజయ్‌తో కలిసి నటించిన ‘కత్తి’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో తాజాగా మరోసారి ఆయనతో కలిసి నటించే అవకాశంను సొంతం చేసుకుంది.
‘రాజా రాణి’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అట్లీ కుమార్ విజయ్‌తో త్వరలో ఒక సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.ఆ సినిమాలో మొదట నయనతారను హీరోయిన్గా ఎంపిక చేయడం జరిగింది.
అయితే తీరా షూటింగ్‌కు వెళ్లే సమయంలో నయనతార ఇతర షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకు సారీ చెప్పిందట.దాంతో ఆ స్థానంలో సమంతను హీరోయిన్గా ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు.
ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ‘కత్తి’ సూపర్ హిట్ అవ్వడంతో ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందేమో అనే ఉద్దేశ్యంతో ఇలా నిర్ణయించినట్లుగా కూడా చెబుతున్నారు.మొత్తానికి తమిళంలో వరుస ఆఫర్లతో సమంత దూసుకు పోతుంది.