రాజ రాజ చోర రివ్యూ అండ్ రేటింగ్

బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కథాబలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ నటుడిగా శ్రీవిష్ణు గుర్తింపును సంపాదించుకున్నారు.సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో ఒకరైన శ్రీవిష్ణుకు ఈ ఏడాది రిలీజైన గాలి సంపత్ రిజల్ట్ షాకిచ్చింది.

 Sreevishnu Rajarajachora Movie Review And Rating, Raja Raja Chora Movie Cast, Ra-TeluguStop.com

అయితే శ్రీవిష్ణు మరో కొత్త కథాంశాన్ని ఎంచుకుని రాజ రాజ చోర సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చారు.టీజర్ తోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందో లేదో ఇప్పుడు చూద్దాం.

జిరాక్స్ షాపులో పని చేసే భాస్కర్ శ్రీవిష్ణు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని మాయమాటలు చెప్పి సంజన మేఘా ఆకాశ్ ను ప్రేమిస్తాడు.సాఫ్ట్ వేర్ జాబ్ చేసే సంజన శ్రీవిష్ణు చెప్పే మాటలను నిజమేనని నమ్ముతుంది.

అయితే అవసరాల నిమిత్తం దొంగతనాలు చేసే భాస్కర్ కు అప్పటికే విద్య సునైనా తో పెళ్లైందని విద్య, భాస్కర్ లకు ఒక కొడుకు కూడా ఉన్నాడని సంజనకు తెలుస్తుంది.మరోవైపు భాస్కర్ దొంగతనం చేస్తూ సీఐగా పని చేస్తున్న విలియం రెడ్డి రవిబాబు కంట పడతాడు.

Telugu Megha Akash, Rajaraja, Sunaina, Telugu Reviews-Movie

భాస్కర్ కు నిజంగానే విద్యతో పెళ్లైందా? సీఐ విలియం రెడ్డి నుంచి భాస్కర్ ఏ విధంగా తప్పించుకుంటాడు? భాస్కర్ దొంగతనాలు చేయడానికి అసలు కారణమేమిటి? అనే ప్రశ్నలకు సమాధానే రాజ రాజ చోర కథలో పెద్దగా ట్విస్టులు లేకపోయినా ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.గంగవ్వ పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది.ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నా సెకండాఫ్ లో కథలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని కూడా సినిమా ఫలితం మరో విధంగా ఉండేది.

Telugu Megha Akash, Rajaraja, Sunaina, Telugu Reviews-Movie

క్లైమాక్స్ ను ఎమోషనల్ కోణంలో ముగించిన దర్శకుడు హసిన్ గోళీ తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు.పాటలు బాగానే ఉన్నా మళ్లీమళ్లీ వినాలనిపించేలా అయితే లేవు.నిర్మాతలు సినిమాకు అవసరం మేరకు ఖర్చు చేశారు.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.కొన్ని సన్నివేశాలు సినిమాటిక్ కోణంలో ఉండటం సెకండాఫ్ లో కొన్ని సీన్లు స్లోగా ఉండటం సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు.

రేటింగ్ : 2.75/5.0

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube