మీడియం రేంజ్ హీరోల్లో మొదటి స్థానాన్ని సంపాదించుకున్న హీరో నాని…( Hero Nani ) ప్రస్తుతం వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ఇండస్ట్రీలో ఆయన కంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు.దసర, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో వరుసగా మూడు విజయాలను సాధించి హ్యట్రిక్ విజయాలను నమోదు చేశాడు.
ఇప్పుడు హిట్ 3 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇక ఈ సినిమాతో పాటుగా శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దర్శకత్వంలో ప్యారడైజ్( Paradise ) అనే సినిమా కూడా చేస్తున్నాడు.

మరి ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.తను అనుకున్నట్టుగానే నాని ఈ సినిమాలతో భారీ విజయాలను సాధిస్తే మాత్రం ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి అయితే క్రియేట్ అవుతుంది.ఇక తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ఆయన అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక దసర సినిమాతో మంచి విజయాన్ని కట్టబెట్టిన శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధించి పెడతాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోగా రాజ్ తరుణ్( Raj Tarun ) కూడా నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో ఆయన ఈ సినిమాలో నటిస్తాడట.మరి ఈ న్యూస్ అఫీషియల్ గా ఇంకా బయటికి రాలేదు కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా చక్కర్లు కొడుతుంది… ఇక ఇప్పటికే రాజ్ తరుణ్ నాగార్జున హీరోగా వచ్చిన నా సామి రంగ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించాడు.ఇక ఇప్పుడు ఈ సినిమాలో కూడా నటించి మెప్పించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల భారీ విజయాన్ని సాధించాలని చూస్తున్నాడు…
.