జోనర్ మార్చిన రాజ్ తరుణ్... ఈ సారి పవర్ ప్లే ఆడబోతున్నాడు

ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ టాలెంటెడ్ నటుడు రాజ్ తరుణ్.ఆ సినిమా తర్వాత వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి మంచి ఊపులోకి వచ్చిన ఈ కుర్ర హీరో సినిమాల ఎంపికలో లోపాలు కారణంగా వరుసగా డిజాస్టర్ సినిమాలని తన ఖాతాలో వేసుకున్నాడు.

 Raj Tarun Tries First Time In Crime Thriller Goner, Tollywood, Telugu Cinema, So-TeluguStop.com

రొటీన్ ఫార్మాట్ కథలతో సినిమాలు చేస్తూ తన ఎనర్జీని పూర్తిగా వేస్ట్ చేసుకుంటున్నాడు అనే టాక్ టాలీవుడ్ లో నడుస్తుంది.మొహమాటం కొద్ది సినిమాలు చేస్తున్నట్లు ఉంది తప్ప అతను చేస్తున్న సినిమాలలో అసలు విషయం ఉండటం లేదని క్రిటిక్స్ పదే పదే విమర్శలు చేస్తున్నారు.

గత ఏడాది రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమా కూడా అతని డిజాస్టర్స్ జాబితాలో చేరిపోయింది.

ఎన్ని ఫ్లాప్ లు వచ్చిన తర్వాత కూడా అతని టాలెంట్ గురించి తెలిసిన దర్శక, నిర్మాతలు అవకాశాలు ఇస్తున్నారు.

ఈ నేపధ్యంలో శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.మరో వైపు ఒరేయ్ బుజ్జిగా సినిమా చేసిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో మరో సినిమాని రాజ్ తరుణ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సారి దర్శకుడు ఇప్పటి వరకు చేసిన లవ్ స్టోరీ కథల మాదిరి కాకుండా థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.రాజ్ తరుణ్ కెరియర్ లో కూడా పూర్తి డిఫరెంట్ జోనర్ లో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.

ఈ సినిమాకి పవర్ ప్లే అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసి తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు.ఇందులో రాజ్ తరుణ్ గన్ పట్టుకొని దేనికోసం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు ఉంది.

మరోవైపు పవర్ ప్లే టైటిల్ లో కూడా బ్లడ్ ని ఎలివేట్ చేశారు.దీనిని బట్టి ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ లో ఉండబోతుందని ఎలివేట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube