విల్లా కోసం ఆశపడి హీరో రాజ్ తరుణ్ కెరీర్ నాశనం చేసుకున్నాడా?

Raj Tarun Shocking Comments About Villa Offer Details Here Goes Viral,raj Tarun,villa,raj Tarun Movies,aha Naa Pellanta,anil Sunkakra,raja Ravindra

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన రాజ్ తరుణ్ కెరీర్ తొలినాళ్లలో వరుస సక్సెస్ లను అందుకుని ఆ తర్వాత వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ విషయంలో ఇబ్బందులు పడ్డారు.అనిల్ సుంకర్ నిర్మాతగా రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన మూడు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి.

 Raj Tarun Shocking Comments About Villa Offer Details Here Goes Viral,raj Tarun-TeluguStop.com

అయితే ఈ మూడు సినిమాలకు రెమ్యునరేషన్ కు బదులుగా రాజ్ తరుణ్ విల్లా తీసుకున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
అయితే విల్లా కోసమే రాజ్ తరుణ్ మూడు సినిమాలు చేశారా? అనేప్రశ్న ఎదురు కాగా ఆ ప్రశ్న గురించి రాజ్ తరుణ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.విల్లా కోసం నేను ఆశ పడ్డానని జరిగిన ప్రచారంలో నిజం లేదని నిజం లేదని మొదట అనిల్ సుంకర బ్యానర్ లో నటించే సమయంలో నాకు విల్లా ఆఫర్ ఇవ్వలేదని రాజ్ తరుణ్ అన్నారు.మొదట కొంత పారితోషికం తీసుకున్నానని ఆయన వెల్లడించారు.

ఒక సినిమాలో నటించే సమయంలోనే మరో రెండు సినిమాలలో ఆఫర్లు రావడంతో డబ్బు తీసుకోకుండా విల్లా తీసుకుంటే బెస్ట్ అని సూచించారని అందుకే నేను విల్లా తీసుకున్నానని రాజ్ తరుణ్ అన్నారు.ఆ విల్లాలోనే ప్రస్తుతం ఉంటున్నానని రాజ్ తరుణ్ కామెంట్లు చేశారు.

నేను ఎంచుకునే స్క్రిప్ట్ ల విషయంలో రాజా రవీంద్ర పాత్ర ఉండదని ఆయన అన్నారు.ఇద్దరం కలిసి కథలు వినే సమయంలో రాజా రవీంద్ర సైలెంట్ గానే ఉంటారని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు.

Telugu Anil Sunkakra, Raj Tarun, Raja Ravindra, Villa-Movie

ఏదైనా కథ నచ్చితే ఆ కథను బెటర్ చేయడానికి రాజా రవీంద్ర సలహాలు ఇస్తారని రాజ్ తరుణ్ కామెంట్లు చేశారు.రాజ్ తరుణ్ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.ఈ ఏడాది అహ నా పెళ్లంట వెబ్ సిరీస్ తో రాజ్ తరుణ్ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం పలు కొత్త ప్రాజెక్ట్ లతో రాజ్ తరుణ్ బిజీగా ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube