బ్లాక్ బస్టర్ సినిమాలు వదులుకుని బాధ పడుతున్న రాజ్ తరుణ్!

సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా అవకాశాలను సంపాదించడం, హీరోగా రాణించడం అంత తేలిక కాదు.అయితే రాజ్ తరుణ్ మాత్రం టాలెంట్ ఉంటే అవకాశాలను సంపాదించడం సాధ్యమేనని ప్రూవ్ చేశాడు.

 Hero Raj Tarun Rejected Three Block Buster Movies  Raj Tarun, Uyyala Jampala, Or-TeluguStop.com

కెరీర్ తొలినాళ్లలో విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ కు గత కొన్నేళ్ల నుంచి వరుస ఫ్లాపులు పలకరిస్తున్నాయి.ఈ నెల 2వ తేదీ ఆహా ఓటీటీలో రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా విడుదలైంది.

విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బిలో యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రాజ్ తరుణ్ అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాను పుట్టింది, పెరిగింది వైజాగ్ అని ఉయ్యాల జంపాలా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి డైరెక్టర్ అయ్యానని చెప్పుకొచ్చారు.ఆ సినిమాకు హీరో కోసం వెతుకుతుంటే అనుకోకుండా తనకే హీరోగా అవకాశం వచ్చిందని చెప్పారు.

రైటర్, డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చానని అనుకోకుండా హీరో అయ్యానని చెప్పారు.తండ్రి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అని, తల్లి గృహిణి ఒక్కడే సంతానం అని రాజ్ తరుణ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

తనకు ఇష్టమైన దర్శకుడు రాజమౌళి అని ఆయనతో కలిసి పని చేయాలని ఉందని అన్నారు.ఆ తరువాత తాను రిజెక్ట్ చేసిన హిట్ సినిమాల గురించి రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు.

ట్యాక్సీవాలా ఆఫర్ మొదట తనకే వచ్చిందని.హారర్ జోనర్ కాబట్టి ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అన్నారు.శతమానం భవతి సినిమాలో కూడా ఆఫర్ వచ్చినా దిల్ రాజు గారు ఆ సినిమాను సంక్రాంతి పండుగకే విడుదల చేయాలని పట్టుబట్టడంతో కుదరలేదని తెలిపారు.హలో గురు ప్రేమ కోసమే సినిమా కథ కూడా మొదట తనకే చెప్పారని అన్నారు.

ఆ సినిమాల్లో రాజ్ తరుణ్ నటించి ఉంటే మాత్రం ఇప్పుడు కెరీర్ మరో విధంగా ఉండేది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube