ఆగస్టులోనే విడుదల పెట్టుకుంటున్న బుజ్జిగాడు  

Raj Tarun Orey Bujjigadu August - Telugu Lock Down, Orey Bujjiga, Ott Plat Farm, Raj Tarun, Theaters, Tollywood, Vijay Kumar

ఆగస్టు నుండి సినిమాల విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే మొదట పెద్ద సినిమాలను విడుదల చేసి ప్రేక్షకులను థియేటర్ల ముందుకు రప్పించాలంటూ మేకర్స్‌ భావిస్తున్నారు.

 Raj Tarun Orey Bujjigadu August

కాని పెద్ద సినిమాలు ఈ విపత్తు సమయంలో విడుదలకు అస్సలు ఆసక్తి చూపడం లేదు.వచ్చే ఏడాది ఆరంభం వరకు పెద్ద సినిమాలు ఒక్కటి అంటే కనీసం ఒక్కటి కూడా విడుదల అయ్యే అవకాశం లేకపోవడంతో చిన్న సినిమాలకే క్యూ కడుతున్నాయి.

బొమ్మ పడేందుకు స్విచ్‌ ఆన్‌ చేయడమే ఆలస్యం వెంటనే రాజ్‌ తరుణ్‌ నటించిన ‘ఒరేయ్‌ బుజ్జిగా’ చిత్రంను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.ఈ సినిమాను థియేటర్లు ఓపెన్‌ అయిన రోజునే విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఆగస్టులోనే విడుదల పెట్టుకుంటున్న బుజ్జిగాడు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఏం జరిగితే అదే జరిగింది అంటూ ఈ ధైర్యంను చేయబోతున్నారు.థియేటర్లలో ఆకట్టుకోకుంటే వెంటనే ఓటీటీ లో విడుదల చేస్తారట.

రాజ్‌ తరుణ్‌కు ఈ సినిమా ఎంతో కీలకం.ప్రస్తుతం ఈయన చేస్తున్న ఇతర సినిమాల భవిష్యత్తు, ఆయన సినీ కెరీర్‌ మొత్తం కూడా ఈ సినిమాపై ఆదారపడి ఉంది.గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు విజయ్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.పెద్ద ఎత్తున ఆ మద్య ప్రచారం చేసి విడుదలకు సిద్దం చేయగా లాక్‌ డౌన్‌ కారణంగా అర్థంతరంగా ఆగిపోయింది.

మళ్లీ ఆగస్టులో విడుదలకు సిద్దం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test