మొత్తానికి రాజ్ తరుణ్ సినిమా పాటలొచ్చాయి

ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లో హీరగా తెరంగేట్రం చేసి అందరి దృష్టిని ఆకర్షించిన యువ రాజ్ తరుణ్.షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నటుడుగా కెరియర్ స్టార్ట్ చేసిన రాజ్ తరుణ్ తరువాత టాలీవుడ్ లోక్రేజీ హీరోగా మారిపోయాడు.

 Raj Tarun New Movie Songs Release, Director Konda Vijay Kumar, Malavika Nair, He-TeluguStop.com

వరుసగా మూడు హిట్స్ తో మంచి జోష్ లోకి వచ్చాడు.అయితే తరువాత అతను నటించిన సినిమాలు అన్ని కూడా ఫ్లాప్ అవుతూ రావడంతో అతని ఇమేజ్ బాగా డామేజ్ అయ్యింది.

పెద్ద బ్యానర్ లో చేసిన సినిమాలు కూడా తుస్సుమన్నాయి.కథల ఎంపికలో లోపాలు వలన అతని కెరియర్ సందిగ్ధంలో పడింది.

అయితే అతనికి అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి.కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో ఒరేయ్ బుజ్జిగా అనే సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటించాడు.
ఇందులో మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు.ఈ సినిమా టీజర్ ఎప్పుడో రిలీజ్ అయింది.టీజర్ కొంత ఆకట్టుకుంది.అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడిపోయింది.

ఈ సమయంలో సినిమా మీద బజ్ కూడా తగ్గిపోయింది.అయితే తాజాగా సినిమాలోని అన్ని పాటలకి సంబందించిన జ్యూక్ బాక్స్ రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.చాలా గ్యాప్ తర్వాత మరోసారి ఈ సినిమా పాటలని రిలీజ్ చేయడం ద్వారా బుజ్జిగాడు మీద హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక రాజ్ తరుణ్ కెరియర్ లో కూడా ఈ సినిమా చాలా కీలకం అని చెప్పాలి.అలాగే దర్శకుడు కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా చక్కని అవకాశం మరి.వీరికి ఒరేయ్ బుజ్జిగా సినిమా ఎంత వరకు సక్సెస్ ఇస్తుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube