మహేష్ బాబు సినిమాలో చిన్న పాత్ర అయినా ఓకే అంటున్న రాజ్ తరుణ్  

Raj Tarun Interested to Act in Mahesh Babu Movie, Tollywood, Telugu Cinema, Raj Tarun, Super Star Mahesh Babu, Web Series - Telugu Raj Tarun, Raj Tarun Interested To Act In Mahesh Babu Movie, Super Star Mahesh Babu, Telugu Cinema, Tollywood, Web Series

ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్తా మామా సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకొని క్రేజీ హీరోగా మారిపోయిన నటుడు రాజ్ తరుణ్.షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ ప్రారంభించి తరువాత సిల్వర్ స్క్రీన్ హీరోగా ఎదిగిన రాజ్ తరుణ్ కెరియర్ గత కొంత కాలం నుంచి పూర్తిగా గాడి తప్పింది.

TeluguStop.com - Raj Tarun Interested To Act In Mahesh Babu Movie

వరుస డిజాస్టర్ లతో కనీసం ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేని స్థాయికి పడిపోయాడు.ప్రస్తుతం ఒరేయ్ బుజ్జిగా అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది.దసరాకి ఈ సినిమా రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు.

TeluguStop.com - మహేష్ బాబు సినిమాలో చిన్న పాత్ర అయినా ఓకే అంటున్న రాజ్ తరుణ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ఈ కుర్ర హీరో తాజాగా ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ మహేష్ బాబుపై తన అభిమానం గురించి చెప్పుకొచ్చాడు.

తనకి వ్యక్తిగతంలో మహేష్ బాబు అంటే ఇష్టం అని అతని సినిమాలు ఎక్కువగా చూడటానికి ఇష్టబడతానని చెప్పుకొచ్చాడు.

అవకాశం వస్తే మహేష్ బాబు సినిమాలో నటించడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని, చిన్న పాత్రలో కనిపించడానికి అయినా ఒకే అని చెప్పాడు.అలాగే పాత్రల ఎంపికలో తనకి ప్రత్యేకమైన ఛాయస్ ఏమీ లేదని, ప్రేక్షకులు ఇప్పుడు సినిమాలు చూసే విధానం మారిందని, అందుకే నెగిటివ్ రోల్స్ అయిన చేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు.

అలాగే వెబ్ సిరీస్ ల కోసం తనని ఎవరూ సంప్రదించలేదని, ఒక వేళ సంప్రదిస్తే మాత్రం కచ్చితంగా చేస్తానని తనకి బిగ్ స్క్రీన్, ఓటీటీ అనే బేధాలు ఏమీ లేవని స్పష్టం చేశాడు.అయితే వరుస ఫెయిల్యూర్స్ కారణంగా రాజ్ తరుణ్ ఆలోచనలో మార్పు వచ్చిందని, లేదంటే వెబ్ సిరీస్ లు నటించడానికి ఒకే చెప్పేవాడు కాదని కొంత మంది ఇండస్టీలో చెప్పుకుంటున్నారు.

#SuperStar #Web Series #Raj Tarun #RajTarun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Raj Tarun Interested To Act In Mahesh Babu Movie Related Telugu News,Photos/Pics,Images..