సెన్సార్ పూర్తి చేసుకున్న రాజ్ తరుణ్ కొత్త సినిమా  

Iddari Lokam Okate Movie Censor Report - Telugu Censor Report, Dil Raju, Iddari Lokam Okate Movie, Raj Tarun, Tollywood

ఉయ్యాల జంపాల సినిమాతో హీరగా ఎంట్రీ తక్కువ టైంలోనే తనకంటూ క్రేజ్ సొంతం చేసుకున్న హీరో రాజ్ తరుణ్.అయితే కెరియర్ లో సినిమా సెలక్షన్ విషయంలో వేసిన తప్పటడుగులు వలన వరుసగా అతను చేసిన సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతూ వచ్చాయి.

Iddari Lokam Okate Movie Censor Report

ఇదిలా ఉంటే వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డ రాజ్ తరుణ్ కి దిల్ రాజు మళ్ళీ లైఫ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.అందులో భాగంగా రాజ్ తరుణ్ హీరోగా ఇద్దరి లోకం ఒకటే అనే లవ్ స్టోరీని తెరకెక్కించాడు.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న రాజ్ తరుణ్ కొత్త సినిమా-Movie-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.

సెన్సార్ వారు ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది.టైటిల్ కి తగ్గట్టే ఎమోషన్ కనెక్ట్ అయితే ఈ సినిమాతో రాజ్ తరుణ్ కి హిట్ తో పాటు కెరియర్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ఒక మంచి అవకాశంగా మారుతుంది.ఇక ఈ సినిమాకి జీ.ఆర్.కృష్ణ దర్శకత్వం వహించగా.మిక్కీ.జె సంగీతం అందిస్తున్నారు.మరి డీలా పడ్డ రాజ్ తరుణ్ కెరియర్ కి ఈ సినిమా ఎంత వరకు ఫుష్ అప్ ఇస్తుంది అనేది వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు

Iddari Lokam Okate Movie Censor Report-dil Raju,iddari Lokam Okate Movie,raj Tarun,tollywood Related....