డ్రీమ్ గర్ల్ రీమేక్ కోసం మళ్ళీ అదే దర్శకుడుతో రాజ్ తరుణ్

టాలీవుడ్ లో యంగ్ టాలెంటెడ్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు రాజ్ తరుణ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ ప్రారంభించిన రాజ్ తరుణ్ తరువాత టాలీవుడ్ లో హీరోగా టర్న్ తీసుకొని కెరియర్ ఆరంభంలో ఏకంగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు.అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

 Raj Tarun Continuous Same Director For Dream Girl Remake-TeluguStop.com

అయితే మొదటి మూడు సినిమాల స్థాయిలో మరొక బ్లాక్ బస్టర్ హిట్ ఇప్పటి వరకు ఆయన కెరియర్ లో పడలేదు.అయినా కూడా రాజ్ తరుణ్ చేతినిండా సినిమాలు ఉన్నాయి.

అయితే ఇప్పుడు కాస్తా మైండ్ సెట్ మార్చుకొని రెగ్యులర్ కథలు కాకుండా కాస్తా కొత్తదనం, కంటెంట్ ఉన్న సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు.ఏదైనా డిఫరెంట్ గా చేసినపుడే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారని అర్ధం చేసుకొని తన నెక్స్ట్ సినిమాలు అన్ని కూడా అలాగే ఉండేలా చూసుకుంటున్నాడు.

 Raj Tarun Continuous Same Director For Dream Girl Remake-డ్రీమ్ గర్ల్ రీమేక్ కోసం మళ్ళీ అదే దర్శకుడుతో రాజ్ తరుణ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం అతను హీరోగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో పవర్ ప్లే అనే సినిమా తెరకెక్కింది.క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.

ఇప్పటి వరకు చేయనటువంటి జోనర్ లో ఈ సినిమాని రాజ్ తరుణ్ చేశాడు.దీంతో మళ్ళీ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతాననే కాన్ఫిడెన్స్ తో ఈ కుర్ర హీరో ఉన్నాడు.

విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ముందు ఒరేయ్ బుజ్జిగా అనే సినిమా చేశాడు.కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు.అయినా కూడా పవర్ ప్లే తో రెండో సినిమా చేశాడు.ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్ లో హిందీ డ్రీమ్ గర్ల్ రీమేక్ ని కూడా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలోనే రాజ్ తరుణ్ చేయనున్నాడు.

ఈ విషయాన్ని తాజాగా రాజ్ తరుణ్ పవర్ ప్లే ప్రమోషన్ ఈవెంట్ లో చెప్పేశాడు.

#Raj Tarun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు