మరోసారి ఉయ్యాల జంపాల పాడతామంటోన్న జంట!

టాలీవుడ్‌లో మొదటి సినిమాతో సక్సెస్ అందుకునే వారి సంఖ్య చాలా తక్కువ.కానీ ఒక్కసారి తొలిసినిమాతో సక్సెస్ అందుకుంటే, ఆ తరువాత కూడా వరుసగా కొందరు మాత్రమే సక్సెస్ అందుకుంటారు.

 Raj Tarun, Avika Gor, Uyyala Jampala, Telugu Movie News-TeluguStop.com

ఈ కోవలోకే చెందాడు యంగ్ హీరో రాజ్ తరుణ్.ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత కూడా రాజ్ తరుణ్ వరుసగా సక్సెస్‌ఫుల్ చిత్రాలలో నటించి మెప్పించాడు.

ఇక అదే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ కూడా ఆ తరువాత కొన్ని సినిమాలు చేసింది.కానీ తప్పుడు కథలను ఎంచుకోవడంతో ఆమె అతి త్వరగా సినిమాల నుండి ఫేడవుట్ అయ్యింది.

ఆమె తన ఫస్ట్ హీరో రాజ్ తరుణ్‌తో కలిసి రెండు సినిమాల్లో నటించగా అవి రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి.ఇప్పుడు మరోసారి రాజ్ తరుణ్‌తో కలిసి ముచ్చటగా మూడోసారి జతకట్టేందుకు ఈ బ్యూటీ రెడీ అవుతోంది.

శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో రాబోయే ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రంలో ఉయ్యాల జంపాల జోడీ మరోసారి రొమాన్స్ చేసి మనల్ని మెప్పించేందుకు రెడీ అవుతున్నారు.ఈ సినిమాను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube