రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్ కాంబినేషన్ లో రెండో సినిమా  

raj tarun and vijay kumar konda combination second movie, Tollywood. Hero Raj Tarun, Director Vijay Kumar Konda, Orei Bujjiga Miovie, Raj Tarun next movie - Telugu Director Vijay Kumar Konda, Orei Bujjiga Miovie, Raj Tarun And Vijay Kumar Konda Combination Second Movie, Raj Tarun Next Movie, Tollywood. Hero Raj Tarun

యంగ్ హీరో రాజ్ తరుణ్ తన కెరియర్ ని గాడిలో పెట్టుకోవడానికి తనకున్న అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటున్నాడు.ఈ ప్రయత్నంలో భాగంగా తనకి సరిపోయే సినిమాలు ఎంపిక చేసుకుంటున్నారు.

TeluguStop.com - Raj Tarun And Vijay Kumar Konda Combination Second Movie

త్వరలో ఒరేయ్ బుజ్జిగా సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.ఈ సినిమా లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన ఈ సినిమాతో మరల హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతాననే నమ్మకంతో రాజ్ తరుణ్ ఉన్నాడు.అయితే అనేక ఆపసోపాలు మధ్య చివరికి ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కి సిద్ధమైంది.

TeluguStop.com - రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్ కాంబినేషన్ లో రెండో సినిమా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకి ఒరేయ్ బుజ్జిగా సినిమా రాబోతుంది.ఇదిలా ఉంటే మరో సారి రాజ్ తరుణ్, విజయ్ కుమార్ కొండా కాంబినేషన్ సినిమా వర్క్ అవుట్ అయ్యింది.

తాజాగా ఈ సినిమాని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

హైదరాబాద్‌ కోకాపేటలో సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది.

వనమాలి క్రియేషన్స్‌ పై మహిధర్‌, దేవేష్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హేమల్‌ ఇంగ్లే ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతుంది.

దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండా మాట్లాడుతూ చక్కని ప్రేమకథ, థ్రిల్లర్‌ అంశాలతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.తన గత సినిమాలకి పూర్తి భిన్నమైన కథ, కథనంతో ఈ సినిమా ఉండబోతుందని అన్నారు.

మా ఇద్దరి కాంబినేషన్‌లో మరో డిఫరెంట్‌ థ్రిల్లర్‌ ఈ సినిమా అవుతుందని రాజ్‌ తరుణ్‌ చెప్పారు.నేటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు.

ఓ వైపు విజయ్ కుమార్ కొండా కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ తో తెలుగు, కన్నడ భాషలలో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ సినిమాని ఇప్పటికే స్టార్ట్ చేసి, సడెన్ గా ఇప్పుడు రాజ్ తరుణ్ తో సినిమాని స్టార్ట్ చేస్తున్నాడంటే కారణం ఏమై ఉంటుంది అని ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది.

#OreiBujjiga #DirectorVijay #RajTarun #RajTarun #Tollywood.Hero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Raj Tarun And Vijay Kumar Konda Combination Second Movie Related Telugu News,Photos/Pics,Images..