విడాకుల తర్వాత 'అనుభవించు రాజా' అంటూ నాగచైతన్య పోస్ట్?

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్న సమంత నాగ చైతన్య విడాకుల తర్వాత చైతన్య పూర్తిగా సోషల్ మీడియాకి దూరం అయ్యాడని చెప్పవచ్చు.సమంత మాత్రం సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు చేస్తూ విడాకులు తీసుకుంటే తప్పు కేవలం మహిళలది మాత్రమే ఉండదు పురుషుల వైపు నుంచి కూడా ఆలోచించాలి అంటూ ఎంతో భావోద్వేగమైన పోస్ట్ చేశారు.

 Raj Tarun Aanubhavinchu Raja Title Song Released By Akkineni Naga Chaitnya-TeluguStop.com

ఇలా విడాకుల ప్రకటన తర్వాత సమంత ఇప్పుడిప్పుడే బాధ నుంచి కోలుకుని తన జీవితంలో ముందుకు సాగాలని ప్రయత్నాలు చేస్తోంది.

ఇకపోతే నాగచైతన్య విడాకుల అనంతరం ఏ విధంగానూ స్పందించకపోవడం గమనార్హం.

 Raj Tarun Aanubhavinchu Raja Title Song Released By Akkineni Naga Chaitnya-విడాకుల తర్వాత అనుభవించు రాజా’ అంటూ నాగచైతన్య పోస్ట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే విడాకుల తర్వాత నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా మొట్టమొదటిసారి స్పందించారు.ట్విట్టర్ వేదికగా నాగచైతన్య స్పందిస్తూ రాజ్ తరుణ్ నటించిన “అనుభవించు రాజా” సినిమా టైటిల్ ట్రాక్ విడుదల కావడంతో ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ లు షేర్ చేస్తూ గుడ్ లక్ చెప్పారు.

ఈ క్రమంలోనే ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంత మంది నెటిజన్లు నాగచైతన్య ట్వీట్ కింద విడాకులు తీసుకోవడానికి కారణాలు ఏంటి అని అడగడంతో అందుకు మాత్రం నాగచైతన్య రెస్పాండ్ కాలేదు.ఇదిలా ఉండగా నాగ చైతన్య థాంక్యూ, బంగార్రాజు వంటి చిత్రాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

#Naga Chaitanya #Taj Tarun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు