అశ్లీల చిత్రాల ద్వారా రాజ్ కుంద్రా రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?

బీ టౌన్ ను కుదిపేస్తున్న రాజ్ కుంద్రా వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఇంత కాలం శిల్పాశెట్టి భర్తగా, బిజినెస్ మ్యాన్ గా గుర్తింపు పొందిన రాజ్.

 Raj Kundra Daily Income With Pornography Videos, Raj Kundra, Pornography Videos,-TeluguStop.com

ప్రస్తుతం చీకటి రాజ్యానికి అధిపతిగా వార్తల్లోకి ఎక్కాడు.అమ్మాయి శరీరాలతో బిజినెస్ చేసే చీప్ క్యారెక్టర్ గా ఆయన బయటికొచ్చాడు.

ఫోర్నోగ్రఫీ కేసులో అరెస్టై ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న ఆయన పలు సంచలన విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది.అశ్లీల వీడియోలన్ సర్క్యులేట్ చేసే కంపెనీ పెట్టి రోజుకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు తేలింది.

ఆయనను విచారిస్తున్న కొద్దీ షాకింగ్ విషయాలు వెల్లడి అవుతున్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఆయన లండన్ వ్యాపారవేత్తగా చలామణి అవుతున్నా.

తొలి నుంచి అతడు అనుమానాస్పద వ్యవహార శైలితోనే కనిపించాడు.ఐపీఎల్ లో అడుగు పెట్టిన ఆయన.రాజస్థాన్ రాయల్స్ జట్టును కొనుగోలు చేశాడు.ఆ తర్వాత బెట్టింగ్ ఆరోణలు రావడంతో ఆయన పేరు వినిపించింది.

అప్పుడే తన గురించి బ్యాడ్ ఒపీనియన్ జనాల్లో వచ్చేసింది.ఆ తర్వాత ఆయన చేస్తున్న చవకబారు పనులన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్ని.

తాజాగా ఫోర్నోగ్రఫీ కేసులు అరెస్టు కావడంతో అతడి ప్రతిష్ట అధ: పాతాళానికి పడిపోయింది.

Telugu Hot Company, Pornography, Raj Kundra, Rajkundra, Umesh Kamath, Mumbai-Tel

కొద్ది రోజుల క్రితం వెస్ట్ ముంబైలో బ్లూ ఫిల్మ్స్ తీసే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.ఆ వీడియోలను అప్ లోడ్ చేసే కంపెనీ మూలాలు లండన్ లో ఉన్నట్లు గుర్తించారు.దానికి చీఫ్ గా ఉమేష్ కామత్ ఉన్నాడు.

అతడు మరెవరో కాదు.రాజ్ కుంద్రా బినామీగా పోలీసులు గుర్తించారు.

లోతుగా విచారించిన పోలీసులు.ఈ వ్యవహారానికి మొత్తం సూత్రధారి రాజ్ కుంద్రాగా గుర్తించి అరెస్టు చేశారు.

తాజాగా ఆయన ఆయా అశ్లీల సైట్లు, యాప్ ల ద్వారా రోజుకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు తేలింది.హాట్ హిట్ మూవీస్ కంపెనీ నుంచి తన అకౌంట్లోకి రోజుకు లక్షల రూపాయలు జమ అయినట్లు గుర్తించారు పోలీసులు.

Telugu Hot Company, Pornography, Raj Kundra, Rajkundra, Umesh Kamath, Mumbai-Tel

తాజాగా రాజ్ కుంద్రాకు ఎప్పుడు ఎన్ని డబ్బులు క్రెడిట్ అయ్యాయనే విషయాలు బయటపడ్డాయి.హాట్ హిట్ మూవీస్ కంపెనీ నుంచి రాజ్ కుంద్రా అకౌంట్లోకి పడిన డబ్బుల వివరాలు ఇప్పుడు చూద్దాం.22 డిసెంబర్ 2020 న, XX790 ఖాతాలోకి హాట్‌హిట్ ఖాతా నుండి రూ .3 లక్షలు వచ్చాయి.2020 డిసెంబర్ 25న లక్ష రూపాయలు, డిసెంబర్ 26న రూ .10 లక్షలు, డిసెంబర్ 28న రూ .50 వేలు, జనవరి 3న 2 లక్షల 5 వేలు, జనవరి 10 న రూ .3 లక్షలు, జనవరి 13న 2 లక్షలు, జనవరి 20న లక్ష రూపాయలు, జనవరి 23 న 95 వేలు, ఫిబ్రవరి 3 న 2 లక్షల 70 వేలు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube