'ది ఫ్యామిలీ మ్యాన్' కు తప్పని వివాదాలు.. ఈ సిరీస్ విడుదల కానట్లేనా..?

రాజ్ డీకే దర్శకత్వంలో విడుదలకానున్న సిరీస్ ‘ది ఫ్యామిలీ మాన్ 2‘.ఇది వరకే ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా.ఇప్పుడు సెకండ్ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఇందులో టాలీవుడ్ నటి సమంత కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఇటీవల ఈ సిరీస్ ట్రైలర్ విడుదల కావడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక మరికొందరు ఈ సిరీస్ ట్రైలర్ పట్ల వ్యతిరేకంగా స్పందించారు.

 Raj And Dk About The Family Man 2 Controversy, The Family Man 2, Controvercy, Sa-TeluguStop.com

దీంతో ఈ సిరీస్ విడుదల కావడానికి మరింత అనుమానాలు ఎదురవుతున్నాయి.

ఈ సిరీస్ లో తమిళ టైగర్లను చెడుగా చూపిస్తున్నారని తమిళులు తీవ్రమైన అభ్యంతరాలు చేయగా.

ఈ సీరీస్ విడుదలను అడ్డుకోవాలని వీరంతా ఓ ఎంపీ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కు లేఖ రాశారు.ఈ నేపథ్యంలో ఈ సీరీస్ డైరెక్టర్ ఈ వివాదం గురించి స్పందించారు.

ట్రైలర్ చూసి ఒక అంచనాకు రావద్దని తెలిపాడు.

అందరూ అనుకుంటున్నట్లు ఈ సిరీస్ ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా ఉండవని.

ఈ సిరీస్ విడుదల వరకు వేచి చూడండి అంటూ తెలిపాడు.ఒక్కసారి ఈ సిరీస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రశంసిస్తారని అన్నాడు డైరెక్టర్.

Telugu Centralprakash, Controvercy, Directors, Priyamani, Raj Dk, Samantha, Tami

ఈ ట్రైలర్ లో కొన్ని సీన్లు మాత్రమే చూసి పూర్తి కథ పై అంచనాలు వేస్తున్నారు అంటూ.ఈ సిరీస్ ను తప్పుగా చూస్తున్నారని తెలిపాడు.ఇక ఈ సిరీస్ లో తమతో పాటు తమ టీమ్ లో కూడా తమిళ ప్రజలు ఉన్నారని, తమకు కూడా తమిళ ప్రజల మనోభావాలు, వారి సంస్కృతి పట్ల అవగాహన ఉందని తెలిపాడు.

అటువంటప్పుడు ఇబ్బంది పెట్టే షోను ఎందుకు చేస్తాము అంటూ అన్నాడు.

ఈ సిరీస్ రూపకల్పనలో ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉందని.సీజన్ 1 కోసం ఏ విధంగా అయితే కష్టపడ్డామో అదేవిధంగా సీజన్ 2 కోసం కూడా అంతే కష్టపడ్డామంటూ తెలిపాడు.

కాబట్టి ఈ సిరీస్ విడుదలయ్యే వరకు ఆగండి అంటూ.ఇందులో కంటెంట్ మీద ఒక అంచనానికి రావాల్సిందిగా కోరుతున్నామని తెలిపాడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube