సమంతను నల్లగా చూపించడానికి అసలు కారణమిదా..?

ఏ మాయ చేశావె సినిమా నుంచి జాను సినిమా వరకు సమంత ప్రతి సినిమాలో ఎంతో అందంగా కనిపించిన సంగతి తెలిసిందే.అయితే ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లో మాత్రం సమంత నల్లగా కనిపించారు.

 Raj And Dk Reacts On Samanthas Skin Tone Who Played Raji Character In Family Man-TeluguStop.com

ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లో సమంత నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నా సమంతను నల్లగా చూపించడానికి కారణమేంటో ప్రేక్షకులకు అర్థం కాలేదు.అయితే దర్శకులు రాజ్, డీకే సమంతను నల్లగా చూపించడానికి అసలు కారణం వెల్లడించారు.

ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లో రాజీ క్యారెక్టర్ ను ఆ విధంగా డిజైన్ చేశామని రాజ్, డీకే తెలిపారు.రాజీ పాత్ర అందం గురించి లెక్కలు వేసే పాత్ర కాదని రాజ్, డీకే చెప్పుకొచ్చారు.

 Raj And Dk Reacts On Samanthas Skin Tone Who Played Raji Character In Family Man-సమంతను నల్లగా చూపించడానికి అసలు కారణమిదా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాలో రాజీ పోరాట యోధురాలిగా, సైనికురాలిగా కనిపిస్తుందని అణచివేతకు గురైన అమ్మాయిగా నటిస్తుందని రాజీ పాత్ర అందంగా చూపించే పాత్ర అయిదే కాదని దర్శకులు చెప్పుకొచ్చారు.ఈ పాత్రకు అందానికి సంబంధం లేదని రాజ్, డీకే తెలిపారు.

క్యారెక్టర్ పరంగా అలా చూపించక తప్పలేదని రాజీ పాత్ర కొరకు సమంత మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుందని రాజ్, డీకే అన్నారు.రాజీ పాత్రకు తగిన విధంగానే దుస్తుల ఎంపిక కూడా జరిగిందని రాజీ చెప్పుకొచ్చారు.

సినిమాలో రాజీ పాత్ర అందం గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదని ఆమె ఎలా కనిపించాలని అలానే కనిపించిందని రాజ్, డీకే తెలిపారు.సమంత అందం గురించి జరుగుతున్న చర్చకు రాజ్, డీకే చెక్ పెట్టారు.

Telugu Family Man, Raji Character, Samantha, Skin Tone-Movie

ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంపై రాజ్, డీకే ఆనందం వ్యక్తం చేశారు.రాజీ పాత్ర అద్బుతంగా రావడానికి సమంతనే కారణమని ఈ దర్శక ద్వయం చెబుతుండటం గమనార్హం.

#Samantha #Raji Character #Skin Tone #Family Man

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు