ది ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ పాత్రతో ఏకంగా సినిమా ప్లాన్

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంతా రీసెంట్ గా ది ఫ్యామిలీ మ్యాన్2 వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అయిన ఈ వెబ్ సిరీస్ లో సమంతా మానవబాంబుగా మారిన ఉగ్రవాది రాజీ పాత్రలో కనిపించింది.

 Raj And Dk Extend For Film With Raji Role, The Family Men 2, Tollywood, Kollywoo-TeluguStop.com

ఇక ఈ వెబ్ సిరీస్ డిజిటల్ ఆడియన్స్ ని మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది.అయితే వెబ్ సిరీస్ లో సమంతా పాత్రపై తమిళ ప్రజలు, సెలబ్రిటీల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది.

తమిళ్ టైగర్స్ ని వెబ్ సిరీస్ లో వ్యతిరేకంగా రిప్రజెంట్ చేశారని, వారు ఐఎస్ఐఎస్ వారితో చేతులు కలిపినట్లు ప్రోజక్ట్ చేసారని తమిళ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telugu Bollywood, Kollywood, Raji Role, Tollywood-Movie

ఆత్మాభిమానం, హక్కుల కోసం జరిగిన పోరాటాన్ని ఉగ్రవాదంగా ప్రోజక్ట్ చేసే ప్రయత్నం చేసారని విమర్శలు చేశారు.ఇదిలా ఉంటే ఇందులో సమంతా చేసిన రాజీ పాత్రకి మాత్రం మంచి ప్రశంసలు లభించాయని చెప్పాలి.ఆ పాత్రలో సమంతా అద్బుతంగా నటించని హీరోయిన్స్ సైతం కొనియాడారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ లో రాజీ పాత్ర గురించి ఓ అప్డేట్ బయటకి వచ్చింది.రాజ్ అండ్ డీజీ ది ఫ్యామి మ్యాన్ 2 వెబ్ సిరీస్ స్టొరీలో రాజీ పాత్ర గురించి సమంతాకి చెప్పినప్పుడే ఆ పాత్రని ప్రధానంగా చేసుకొని ఒక సినిమాని కూడా తెరకెక్కించే ప్రయత్నం చేస్తామని మాట ఇచ్చినట్లు సమాచారం.

ఈ నేపధ్యంలో పాన్ ఇండియా రేంజ్ లో రాజీ పాత్ర బేస్ చేసుకొని ఆమె గత జీవితం ఏంటి.రాజీ ఉగ్రవాదిగా మారడానికి గల కారణాలని ప్రీక్వెల్ లో ఆవిష్కరించే ప్రయత్నం చేయనున్నట్లు సమాచారం.

త్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube