అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు..!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

 Rains In Ap Due To Low Pressure..!-TeluguStop.com

అల్పపీడనం రేపు ఏపీ తీరంవైపు ప్రయాణించే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.అల్పపీడనం, ఉపరితల ఆవర్తనంతో వానలు పడే ఛాన్స్ ఉంది.

రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి.అదేవిధంగా రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.

తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది.ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచనలు జారీ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube